Breaking News

కేకేఆర్‌ రాత మార్చిన రింకూ సింగ్‌!

Published on Sun, 04/19/2026 - 21:58

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఎట్ట‌కేల‌కు తొలి విజ‌యాన్ని సాధించింది. ఐదు ప‌రాజ‌యాల‌తో అట్ట‌డుగు స్థానంలో నిలిచిన కేకేఆర్ ఆదివారం రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌పై గెలుపు రుచి చూసింది. ఒక ద‌శ‌లో 85 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయిన కేకేఆర్ ఈ మ్యాచ్‌లో కూడా ఓట‌మి చ‌విచూస్తుంద‌ని అంతా భావించారు. 

కానీ జ‌ట్టు వైస్‌కెప్టెన్ రింకూ సింగ్ త‌న స‌హ‌చ‌ర బ్యాట‌ర్ అనుకుల్ రాయ్‌తో క‌లిసి వరుస ఓటములతో ఢీలా పడిన కేకేఆర్ రాత‌ను మార్చాడు. 8 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద త‌న‌కు ల‌భించిన లైఫ్‌ను రింకూ సింగ్ చ‌క్క‌గా వినియోగించుకున్నాడు.  రింకూ సింగ్ ఇచ్చిన క్యాచ్‌ను నండ్రీ బ‌ర్గ‌ర్ వ‌దిలేయ‌డం మ్యాచ్‌కు ట‌ర్నింగ్ పాయింట్ ఇదే అని చెప్పొచ్చు. మొత్తంగా రింకూ సింగ్‌ 34 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. అతడి  ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.

త‌న‌కు లైఫ్ వ‌స్తే ఎంత డేంజ‌ర్ అనేది రింకూ సింగ్ రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌కు రుచి చూపించాడు.ఈ సీజ‌న్‌లో ఒక్క మ్యాచ్‌లోనూ చెప్పుకోద‌గ్గ ఇన్నింగ్స్ ఆడ‌ని రింకూ సింగ్ రాజ‌స్తాన్‌తో  మ్యాచ్‌లో త‌న విలువ‌ను చూపించాడు. అనుకుల్ రాయ్ క్రీజులోకి వ‌చ్చేస‌రికి కేకేఆర్ 6 వికెట్ల న‌ష్టానికి 85 ప‌రుగుల‌తో ఉంది. విజ‌యానికి ఆరు ఓవ‌ర్ల‌లో 69 ప‌రుగులు కావాలి. 

అనుకుల్ రాయ్ నుంచి మంచి స‌హ‌కారం అంద‌డంతో రింకూ సింగ్ స్వేచ్ఛ‌గా బ్యాట్‌ను ఝ‌లిపించాడు. ఈ ఇద్ద‌రు ఏడో వికెట్‌కు 37 బంతుల్లోనే 76 ప‌రుగుల విన్నింగ్ భాగ‌స్వామ్యం న‌మోదు చేసి కేకేఆర్‌కు సీజ‌న్‌లో మొద‌టి విజ‌యాన్ని అందించారు. మ్యాచ్ అనంత‌రం రింకూ సింగ్ మాట్లాడాడు. 

‘కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి వస్తుందంటారు. ఇవాళ మ్యాచ్‌లో నా విషయంలో అదే జరిగింది. నిజానికి 8 పరుగుల వద్ద నాకు లైఫ్ లభించినప్పుడు అదృష్టం ఇవాళ నాతోనే ఉందని భావించాను. 85 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి మేము దాదాపు ఓటమి అంచున నిలిచాం. అయితే నాకు లభించిన లైఫ్‌ను రెండో చాన్స్ అనుకుని ఆడాను. అనుకుల్ రాయ్ నుంచి మంచి సపోర్ట్ లభించింది. 

తొలుత నిలదొక్కుకునేందుకు ప్రయత్నించాను. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడడంలో విఫలమయ్యాను. అయితే ఒక పెద్ద ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తూ వచ్చాను. అది ఈరోజు నెరవేరింది. బ్యాటింగ్‌లో నాకు నిర్ధిష్టమైన స్థానమంటూ లేదు. జట్టుకు అవసరమైనప్పుడు ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. 

ఇవాళ్టి ఇన్నింగ్స్ పట్ల పూర్తి సంతోషంగా ఉన్నా. సీజన్‌లో మా జట్టకు ఇదే తొలి విజయం కాబట్టి, మాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పొచ్చు. ఇదే ఊపును రాబోయే మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా.’ అని చెప్పుకొచ్చాడు. ఇక రింకూకు సపోర్ట్‌ ఇచ్చిన అనుకుల్‌ రాయల్‌ (16 బంతుల్లో 29 నాటౌట్‌) జీవితంలో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు.

చదవండి: ఒకే ఓవర్లో 32 పరుగులు.. లక్నో బౌలర్‌కు చుక్కలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)