అదేం బౌలింగ్‌?.. అతడు అవసరమా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Published on Fri, 02/27/2026 - 15:05

టీమిండియా ఎట్టకేలకు టీ20 ప్రపంచకప్‌-2026 సూపర్‌-8 దశలో పాయింట్ల ఖాతా తెరిచింది. చెన్నై వేదికగా పసికూన జింబాబ్వేను 72 పరుగులతో చిత్తు చేసింది. తద్వారా రెండు పాయింట్లు సాధించడంతో పాటు.. నెట్‌రన్‌రేటును మెరుగుపరుచుకుంది. తదుపరి ఆదివారం నాటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై గెలిస్తే నేరుగా సెమీ ఫైనల్లో అడుగుపెడుతుంది భారత్‌.

ఏకంగా 256 పరుగులు
ఇక గురువారం నాటి మ్యాచ్‌లో చెపాక్‌ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించడంతో భారత బ్యాటర్లు చెలరేగిన విషయం తెలిసిందే. జింబాబ్వే బౌలింగ్‌ను చితక్కొడుతూ టీమిండియా ఏకంగా 256 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే సైతం ఈ బ్యాటింగ్‌ పిచ్‌పై 184 పరుగులు చేయగలిగింది.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ భారత బౌలింగ్‌ వ్యూహంపై పెదవి విరిచాడు. ముఖ్యంగా ఆల్‌రౌండర్‌ శివం దూబే (Shivam Dube)తో ఎందుకు బౌలింగ్‌ చేయించారో అర్థం కాలేదన్నాడు. కాగా జింబాబ్వే (IND vs ZIM)తో మ్యాచ్‌లో దూబే రెండు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఏకంగా 46 పరుగులు సమర్పించుకుని.. ఒకే ఒక్క వికెట్‌ తీశాడు. నోబాల్‌, వైడ్‌లతో ప్రత్యర్థికి అదనపు పరుగులు ఇచ్చుకున్నాడు.

ఇది బ్యాటింగ్‌ పిచ్‌
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘అసలు ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ గురించి ఆందోళన పడాల్సిన పనిలేదు. ఇది బ్యాటింగ్‌ పిచ్‌. అలాంటపుడు టీమిండియా ఆరో బౌలింగ్‌ ఆప్షన్‌ గురించి ఎందుకు ఆలోచించిందో అర్థం కాలేదు.

ఎక్కడ బౌలింగ్‌ చేస్తున్నాడో చూశారా?
అసలు దూబే ఎక్కడ బౌలింగ్‌ చేస్తున్నాడో చూశారా? అతడు సిక్స్త్‌ స్టంప్‌ మీదకు బాల్‌ వేస్తున్నాడు. ఇలాంటి బౌలింగ్‌ నేనెప్పుడూ చూడనేలేదు. టీమిండియా వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే బరిలోకి దిగింది. ఒకవేళ దూబే వంటి వాళ్లతో బౌలింగ్‌ చేయించాలనుకుంటే ముందుగా ప్రాక్టీస్‌ చేయించాలి.

ఇది కేవలం నెట్‌రన్‌రేటును మెరుగుపరచుకోవడం గురించి కాదు. ముందుగా మ్యాచ్‌ గెలవాలి. అప్పుడే పాయింట్లు వస్తాయి’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ టీమిండియా యాజమాన్యం తీరును విమర్శించాడు. ఏదేమైనా భారత జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంటుందని.. అప్పుడు అవసరమైతే ఆరో బౌలింగ్‌ ఆప్షన్‌ను వాడుకోవచ్చని చిక్కా సూచించాడు.

చదవండి: T20 WC 2026: భారత్‌-వెస్టిండీస్‌ మ్యాచ్‌ రోజు వర్షం పడితే..?

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)