Breaking News

ఐపీఎల్‌లో ధావన్‌ చరిత్ర.. భారత్‌ తరపున తొలి క్రికెటర్‌గా

Published on Wed, 04/05/2023 - 22:31

టీమిండియా గబ్బర్‌ శిఖర్‌ ధావన్‌ ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ధావన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఇన్నింగ్స్‌ ఆఖరి వరకు నిలిచిన గబ్బర్‌ 56 బంతుల్లో 9 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 86 నాటౌట్‌ వింటేజ్‌ ధావన్‌ను తలపించాడు. తొలుత ప్రబ్‌సిమ్రన్‌ సింగ్‌ రెచ్చిపోతుంటే తాను యాంకర్‌పాత్ర పోషించాడు.


Photo: IPL Website

ప్రబ్‌సిమ్రన్‌ ఔటైన తర్వాత ధావన్‌ తన ఆట మొదలుపెట్టాడు. చహల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ నాలుగో బంతిని బౌండరీ బాదడం ద్వారా ధావన్‌ అర్థసెంచరీ మార్క్‌ అందుకున్నాడు.  ఈ క్రమంలోనే ఐపీఎల్‌లో ధావన్‌ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఐపీఎల్‌లో ధావన్‌కు ఇది 48వ అర్థసెంచరీ కాగా ఓవరాల్‌గా అతనికి ఇది 50వ 50ప్లస్‌ స్కోరు కావడం విశేషం.

ఐపీఎల్‌లో డేవిడ్‌ వార్నర్‌(54 అర్థసెంచరీలు) తర్వాత అత్యధిక హాఫ్‌ సెంచరీలు బాదిన రెండో ఆటగాడిగా.. టీమిండియా తరపున తొలి బ్యాటర్‌గా ధావన్‌ నిలిచాడు. ఇక కింగ్‌ కోహ్లి 45 హాఫ్‌ సెంచరీలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌పై ధావన్‌కు ఇది ఏడో హాఫ్‌ సెంచరీ.


Photo: IPL Website

అయితే సీఎస్‌కేపై ధావన్‌ ఎనిమిది అర్థసెంచరీలు సాధించాడు. ఆ తర్వాత తాను ప్రస్తుతం ఆడుతున్న పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌పై ఏడు అర్థసెంచరీలు, ముంబై, కేకేఆర్‌, ఆర్‌సీబీలపై ఆరు అర్థసెంచరీలు సాధించాడు. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌పై ధావన్‌ 22 మ్యాచ్‌ల్లో 126 స్ట్రైక్‌రేట్‌తో 576 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్‌లో 85 పరుగుల ఇ‍న్నింగ్స్‌ ధావన్‌కు అత్యధిక స్కోరుగా ఉంది.

చదవండి: ధావన్‌కు అశ్విన్‌ వార్నింగ్‌.. వీడియో వైరల్‌

ధావన్‌ దెబ్బకు రిటైర్డ్‌హర్ట్‌.. ఐపీఎల్‌కు దూరమయ్యే చాన్స్‌!

Videos

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

Photos

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)