Breaking News

చ‌రిత్ర సృష్టించిన దీప్తిశ‌ర్మ‌

Published on Mon, 10/26/2026 - 13:51

జింబాబ్వేతో జ‌రిగిన రెండో వ‌న్డేలో 121 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్‌ను 2-0తో కైవ‌సం చేసుకుంది. మాజీ కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్‌తో పాటు ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. బౌలింగ్‌లో వైష్ణ‌వి శ‌ర్మ (4 వికెట్లు), దీప్తి శ‌ర్మ (3 వికెట్లు) రాణించి జింబాబ్వే ప‌త‌నాన్ని శాసించారు. 

ఈ నేప‌థ్యంలో ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ ఒక అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకుంది. వ‌న్డే క్రికెట్‌లో రెండు లేదా అంత‌కంటే ఎక్కువ సెంచ‌రీలు చేయ‌డంతో బౌలింగ్‌లో 150 ప్ల‌స్ వికెట్లు తీసిన మూడో క్రికెట‌ర్‌గా, తొలి భార‌త మ‌హిళా క్రికెట‌ర్‌గా దీప్తి శ‌ర్మ రికార్డులకెక్కింది. 

👉దీప్తి శ‌ర్మ వ‌న్డేల్లో ఇప్ప‌టివ‌ర‌కు 168 వికెట్లు తీయ‌డంతో పాటు రెండు సెంచ‌రీలు సాధించింది.  ఈ జాబితాలో స‌చిన్ టెండూల్క‌ర్ (49 సెంచ‌రీలు, 154 వికెట్లు) అంద‌నంత ఎత్తులో కొన‌సాగుతుండ‌గా, మాజీ క్రికెట‌ర్ మ‌నోజ్ ప్ర‌భాక‌ర్ (రెండు సెంచ‌రీలు, 157 వికెట్లు) రెండో స్థానంలో ఉండ‌గా, దీప్తి శ‌ర్మ మూడో స్థానంలో కొన‌సాగుతుంది.

👉ఇక వ‌న్డేల్లో దీప్తి శ‌ర్మ‌కు ఇది రెండో వ‌న్డే సెంచ‌రీ. కాగా 2017, మే 15న ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో దీప్తి శ‌ర్మ 160 బంతుల్లో 188 ప‌రుగులు చేసి వ‌న్డేల్లో తొలి సెంచ‌రీ సాధించింది. తాజాగా తొమ్మిదేళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ దీప్తి వ‌న్డేల్లో రెండో శ‌త‌కాన్ని అందుకుంది.

👉మ‌హిళ‌ల వ‌న్డే క్రికెట్‌లో భార‌త్ త‌ర‌ఫున ఆరు లేదా ఆ త‌ర్వాతి స్థానాల్లో బ్యాటింగ్‌కు వ‌చ్చి సెంచ‌రీ బాదిన తొలి క్రికెట‌ర్‌గా దీప్తి శ‌ర్మ చ‌రిత్ర సృష్టించింది. 86 బంతుల్లో 106 ప‌రుగుల అజేయ ఇన్నింగ్స్‌తో మెరిసిన దీప్తి శ‌ర్మ..  రిచా ఘోష్ (94 ప‌రుగులు వ‌ర్సెస్ సౌతాఫ్రికా) రికార్డును బ‌ద్ద‌లుకొట్టింది.

👉83 బంతుల్లో సెంచ‌రీ మార్క్ అందుకున్న‌ దీప్తి శ‌ర్మ భార‌త‌ మ‌హిళా క్రికెట‌ర్ల‌లో వేగ‌వంత‌మైన సెంచ‌రీ సాధించిన మూడో క్రికెట‌ర్‌గా రికార్డులకెక్కింది. స్మృతి మంధాన (50 బంతుల్లో వ‌ర్సెస్ ఆస్ట్రేలియా 2025; 70 బంతుల్లో వ‌ర్సెస్ ఐర్లాండ్, 2025; 77 బంతుల్లో వ‌ర్సెస్ ఆస్ట్రేలియా, 2025) మూడుసార్లు ఈ ఫీట్ సాధించ‌గా, హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్ (82 బంతుల్లో వ‌ర్సెస్ ఇంగ్లండ్‌, 2025) రెండో స్థానంలో ఉంది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగుల భారీ స్కోరు సాధించింది. మాజీ కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్‌( 121 బంతుల్లో 15 ఫోర్లతో 126 పరుగులు),  దీప్తీ శర్మ(86 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 106 పరుగులు) అద్భుత సెంచ‌రీలతో చెల‌రేగారు. జింబాబ్వే బౌలర్లలో నోమ్వెలో సిబాన్డా 2 వికెట్లు తీసింది.

అనంత‌రం 329 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన జింబాబ్వే 48.5 ఓవ‌ర్ల‌లో 207 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భార‌త స్పిన్న‌ర్ వైష్ణ‌వి శ‌ర్మ నాలుగు వికెట్ల‌తో ప్ర‌త్య‌ర్ధి జ‌ట్టును దెబ్బ‌తీసింది.జింబాబ్వే బ్యాట‌ర్ల‌లో మోడెస్టర్ ముపాచిక్వా(49),చిపో ముగేరి-తిరిపానో(46) టాప్ స్కోరర్ల‌గా నిలిచారు. ఇరుజట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరగనుంది.

 

ఇదీ చదవండి: 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)