Breaking News

శ్రేయస్‌, రాహుల్‌ అత్యద్భుతం.. కివీస్‌ నుంచి గట్టి పోటీ తప్పదు..!

Published on Wed, 11/15/2023 - 10:39

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఇవాళ (నవంబర్‌ 15) జరిగే సెమీఫైనల్‌ మ్యాచ్‌పై టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ఈ మ్యాచ్‌పై గంభీర్‌ విశ్లేషణ చేస్తూ ఇలా అన్నాడు. 

సెమీఫైనల్లో కచ్చితంగా భారత జట్టే ఫేవరెట్‌. ఈ టోర్నీలో ప్రత్యర్థుల్ని కంగుతినిపించడమే కాదు... భారత్‌తో ఢీ అంటేనే కష్టం అనిపించేలా మనోళ్లు జైత్రయాత్ర సాగించారు. ముఖ్యంగా ఈ టోర్నీలో భారత బౌలింగ్‌ నన్ను ఆకట్టుకుంది. బౌలర్లు జట్టు భారాన్ని తమ భుజాలపై మోశారు. 

ఈ ప్రపంచకప్‌ గెలిస్తే మాత్రం దేశంలో బౌలింగ్‌ విప్లవం ఖాయం. ఇంతవరకు మనలో చాలామంది సచినో, కోహ్లినో కావాలనుకునే క్రికెట్‌లో అడుగుపెట్టేవారు. కానీ ఈ వరల్డ్‌కప్‌ తర్వాత బౌలర్ల లక్ష్యంతో అకాడమీలు కళకళలాడుతాయంటే ఆశ్చర్యం లేదు. 

కేఎల్‌ రాహుల్‌ బ్యాటింగ్‌ కళ్లప్పగించేలా చేసింది. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై బాదిన శతకం (102) అయితే హైలైట్‌ అని చెప్పొచ్చు. చక్కని ఫుట్‌వర్క్, పరిణతితో కూడిన ఫ్లిక్‌ షాట్స్‌తో ఫోర్లు, సిక్సర్లు అదరగొట్టాడు. మణికట్టు స్ట్రోక్‌ప్లేతో పరుగులు సాధించిన తీరు అద్భుతం. దీంతో రాహుల్‌ను ఇప్పుడు 360 డిగ్రీ ప్లేయర్‌ అనొచ్చు. 160 స్ట్రయిక్‌రేట్‌ అతని టాప్‌గేర్‌ను సూచిస్తోంది. 

అలాగని శ్రేయస్‌ అయ్యర్‌ ఏం తక్కువ కాదు. డచ్‌పై అతని ఆయుధం పుల్‌ షాట్‌లే. 128 పరుగుల్లో 42 ఆ షాట్లతో వచ్చినవే! అవే అతని సెంచరీని తేలిక చేశాయి. షార్ట్‌పిచ్‌ బంతులపై అయ్యర్‌ కనబరిచిన నైపుణ్యం మురిపించింది. ఏ బంతుల్ని ఎలా ఆడాలో... ఏవి వదిలేయాలో వివేకం చూపించాడు. 

అయితే కివీస్‌తో జరిగే సెమీస్‌లో మాత్రం అతనికి బౌన్స్, స్వింగ్‌ పరీక్షలు ఎదురవొచ్చు. తప్పకుండా న్యూజిలాండ్‌ నుంచి భారత్‌కు సవాల్‌ ఎదురవుతుంది. ప్రపంచకప్‌ కోసం బాగా సన్నద్ధమై వచ్చారు. వంద శాతం నిబద్ధతతో మెగా ఈవెంట్‌ ఆడుతున్నారు. బౌలింగ్, ఫీల్డింగ్‌లో న్యూజిలాండ్‌ మోహరింపు కట్టుదిట్టంగా ఉంటోంది. 

భారత టాప్‌–3 కోసం ఇదివరకే కసరత్తు చేసే వుంటారు. ఇందులో ఏ సందేహం లేదు. బౌలింగ్‌ ఫ్రెండ్లీ వాంఖెడే పిచ్‌పై భారత బ్యాటర్లకు చేజింగ్‌ కాస్త ఇబ్బందికరంగా మారొచ్చు. అయితే మనవాళ్లు బాగా ఆడితే ఎవరైనా ఏమీ చేయలేరు.   
 

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)