Breaking News

7 వికెట్లతో చెలరేగిన సీఎస్‌కే ఫాస్ట్‌ బౌలర్‌

Published on Mon, 12/29/2025 - 14:38

విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర బౌలర్‌ రామకృష్ణ ఘోష్‌ చెలరేగిపోయాడు. 9.4 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు. విజయ్‌ హజారే ట్రోఫీ చరిత్రలో ఇది పదో అత్యుత్తమ ప్రదర్శన. ఈ టోర్నీ చరిత్రలో ఇప్పటివరకు ఇద్దరు 8 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేయగా.. ఘోష్‌తో పాటు 10 మంది 7 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.

తాజా మ్యాచ్‌లో ఘోష్‌ చెలరేగడంతో హిమాచల్‌ ప్రదేశ్‌ 49.4 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. పుఖ్రాజ్‌ మన్‌ (110) సెంచరీ చేయడంతో హెచ్‌పీ గౌరవప్రదమైన స్కోర్‌ చేయగలిగింది. హెచ్‌పీ ఇన్నింగ్స్‌లో మన్‌కు వైభవ్‌ అరోరా (40), అమన్‌ప్రీత్‌ సింగ్‌ (30), నితిన్‌ శర్మ (21) ఓ మోస్తరుగా సహకరించారు.

అనంతరం ఛేదనలో మహారాష్ట్ర కూడా తడబడుతుంది. 11.3 ఓవర్లలో 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, అంకిత్‌ బావ్వే (4) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వైభవ్‌ అరోరా, ధలివాల్‌ తలో వికెట్‌ తీశారు.

కాగా, ఈ మ్యాచ్‌లో బంతితో చెలరేగిన రామకృష్ణ ఘోష్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌  2026 వేలానికి ముందు రీటైన్‌ చేసుకుంది. ఘెష్‌ను సీఎస్‌కే 2025 వేలంలో 30 లక్షల బేస్‌ ధరకు సొంతం చేసుకుంది. కుడి చేతి వాటం ఫాస్ట్‌ మీడియ​ం బౌలర్‌ అయిన 28 ఏళ్ల ఘోష్‌ గత సీజన్‌లో ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. 

అయినా సీఎస్‌కే యాజమాన్యం అతనిపై నమ్మకం పెట్టుకొని తిరిగి రీటైన్‌ చేసుకుంది. ఘోష్‌ లోయర్‌ ఆర్డర్‌లో ఉపయోగకరమైన బ్యాటర్‌ కూడా. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అతను 11 మ్యాచ్‌ల్లో 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 443 పరుగులు చేశాడు. లిస్ట్‌-ఏ ఫార్మాట్‌లోనూ అతను ఓ మోస్తరుగా రాణించాడు. 4 ఇన్నింగ్స్‌ల్లో ఓ హాఫ్‌ సెంచరీ చేశాడు.

 

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)