Breaking News

వైభవ్ క్రేజ్‌.. స్వదేశంలో ముగిసి విదేశంలో మొద‌లు!

Published on Fri, 06/05/2026 - 19:50

ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ గురించే చ‌ర్చ న‌డిచింది. ఈ సీజ‌న్‌లో 16 మ్యాచ్‌లాడిన వైభ‌వ్ 237 స్ట్రైక్‌రేట్‌తో 776 ప‌రుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకోవ‌డంతో పాటు మోస్ట్ వాల్యుబ‌ల్ ప్లేయ‌ర్‌, ఎమ‌ర్జింగ్ ప్లేయ‌ర్ అవార్డుల‌ను సొంతం చేసుకున్నాడు. అత‌డి బ్యాటింగ్ విధ్వంసంపై దిగ్గ‌జాలు స‌హా మాజీ క్రికెట‌ర్లు అభినందించారు.  

వైభ‌వ్‌ను జాతీయ జ‌ట్టుకు ఎంపిక చేయాల‌ని కూడా డిమాండ్లు వినిపించాయి. అయితే వైభ‌వ్ సూర్య‌వంశీ క్రేజ్ ఇప్పుడు విదేశాల‌కు కూడా పాకింది. విదేశాల‌కు చెందిన మాజీ క్రికెట‌ర్లు కూడా వైభ‌వ్‌ను టీమిండియాకు ఎంపిక చేయాల‌ని త‌మ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్‌, న్యూజిలాండ్ మ‌ధ్య లార్డ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులోనూ వైభ‌వ్ సూర్య‌వంశీ గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది.  

మ్యాచ్ తొలిరోజు మ‌ధ్య‌లో వర్షం ప‌డ‌డంతో విరామ సమయంలో కామెంటేటర్ సైమన్ డౌల్ వైభ‌వ్ సూర్య‌వంశీ బ్యాటింగ్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చాడు. అతని బ్యాటింగ్ అద్భుతమంటూ, నేరుగా భారత జట్టులోకి తీసుకుంటారేమోనని పేర్కొన్నాడు. దీనికి స‌హ‌చ‌ర కామెంటేట‌ర్లు, మాజీ క్రికెటర్లు నాసిర్ హుస్సేన్‌, ఇయన్ వార్డ్ కూడా.. 'అవును వైభ‌వ్‌ను జాతీయ జ‌ట్టులోకి తీసుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చేసిన‌ట్లుంది'అంటూ పేర్కొన‌డం ఆస‌క్తి క‌లిగించింది. 

అయితే టీమిండియాలోకి వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపికపై ఇంకా స‌మ‌యం ఉంద‌ని బీసీసీఐ పేర్కొంది. 15 ఏళ్లే కావ‌డంతో అత‌డికి క్రికెట‌ర్‌గా చాలా భ‌విష్య‌త్తు ఉంద‌ని, ఈలోగా ఇండియా-ఏ త‌ర‌ఫున త‌న ఆట‌ను చూపించే అవ‌కాశ‌మిస్తున్న‌ట్లు తెలిపింది. లంక ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ఇండియా-ఏ జ‌ట్టులో వైభ‌వ్ చోటు ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇండియా-ఏ జ‌ట్టు శ్రీలంక‌-ఏ, అఫ్గానిస్తాన్‌-ఏ జ‌ట్ల‌తో ట్రై సిరీస్ ఆడ‌నుంది. 

ఇక మ్యాచ్ విష‌యానికొస్తే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 113 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో ఇంగ్లండ్‌కు 27 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ల‌భించింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ 31 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 2 వికెట్ల న‌ష్టానికి 124 ప‌రుగుల‌తో ఆడుతుంది. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ 151 ప‌రుగుల లీడ్‌లో ఉంది.

చదవండి: గెంటేస్తారన్న భ‌యం.. క‌ట్‌చేస్తే చ‌రిత్ర‌కు అడుగు దూరంలో!

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)