Breaking News

తారలు తరలి వెళ్లారు...

Published on Mon, 02/24/2025 - 03:59

దుబాయ్‌: దాయాదుల దమ్మెంతో ప్రత్యక్షంగా చూసేందుకు తారలంతా దుబాయ్‌కి తరలి వెళ్లారు. ఏదో ఒక రంగమని కాకుండా... సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ రంగాలకు చెందిన హేమాహేమీలతో దుబాయ్‌ స్టేడియం ఓ తారాతీరమైంది. మైదానంలో భారత ఆటగాళ్లు, గ్యాలరీలో భారత అతిరథులతో స్టేడియం కళకళలాడింది.

టీమిండియా క్రికెటర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, సూర్యకుమార్‌ యాదవ్, తిలక్‌ వర్మ, అభిషేక్‌ శర్మ, టీమిండియా మాజీ సభ్యులు శిఖర్‌ ధావన్, వెంకటేశ్‌ ప్రసాద్‌... తెలుగు సినీ ప్రముఖులు మెగాస్టార్‌ చిరంజీవి, ‘పుష్ప’ సీక్వెల్స్‌తో పాన్‌ ఇండియా డైరెక్టర్‌ అయిన సుకుమార్, బాలీవుడ్‌ నుంచి హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ తన భర్త ఆనంద్‌ అహుజాతో కలిసి రాగా, వివేక్‌ ఒబెరాయ్, ఊర్వశీ రౌతేలా, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్‌కర్డ్‌ సంగ్మా, త్రిపుర వెస్ట్‌ నియోజకవర్గం లోక్‌సభ సభ్యుడు బిప్లాబ్‌ కుమార్‌ దేబ్, ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్, బ్రిటన్‌ పాప్‌ సింగర్‌ జాస్మిన్‌ వాలియా, బాలీవుడ్‌ చిత్ర గీతాలతో పాపులర్‌ అయిన పాకిస్తాన్‌ సింగర్‌ అతీఫ్‌ అస్లామ్‌ తదితరులతో వీఐపీ గ్యాలరీలు కొత్త శోభను సంతరించుకున్నాయి. 

పాకిస్తాన్‌ దిగ్గజ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది, ఇమాద్‌ వసీమ్, పాక్‌ దివంగత ప్రధాని బెనజీర్‌ భుట్టో కుమార్తె భక్తావర్‌ భుట్టో జర్దారి, మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కుమారుడు ఖాసీమ్‌ ఖాన్, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విభాగం, ఐటీ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ తదితరులు మ్యాచ్‌ను తిలకించిన వారిలో ఉన్నారు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)