Breaking News

విండీస్‌తో తొలి టెస్టు.. ఓపెనర్‌గా జైశ్వాల్‌, గిల్‌ మూడో స్థానంలో

Published on Wed, 07/12/2023 - 08:07

డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఓటమి తర్వాత టీమిండియా తొలి టెస్టు సిరీస్‌ ఆడనుంది. వెస్టిండీస్‌, టీమిండియా మధ్య ఇవాళ్టి(జూలై 12) నుంచి విండ్సర్‌ పార్క్‌ వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ జరగనుంది.  పేలవ ఫామ్‌తో టెస్టు స్పెషలిస్ట్‌ చతేశ్వర్‌ పుజారా టీమిండియాలో చోటు కోల్పోయాడు. దేశవాలీ క్రికెట్‌ సహా ఐపీఎల్‌లో ఆకట్టుకున్న యశస్వి జైశ్వాల్‌ అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది.అయితే అతను ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఓపెనర్‌గా వస్తాడని కొంతమంది అంటే.. లేదు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడన్నారు. ఇదే విషయంపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. 

''బ్యాటింగ్‌ పొజిషన్‌లో శుబ్‌మన్‌ గిల్‌ మూడో నెంబర్‌లో రానున్నాడు. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో మాట్లాడిన గిల్‌.. తన కెరీర్‌లో ఎక్కువగా మూడు, నాలుగు స్థానాల్లోనే బ్యాటింగ్‌కు వచ్చానని.. అందుకే విండీస్‌తో టెస్టు సిరీస్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని పేర్కొన్నాడు. ఒక రకంగా ఇది మాకు మంచిదే. ఇక నాతో కలిసి యశస్వి జైశ్వాల్‌ ఓపెనింగ్‌ చేస్తాడు. నిజానికి ఓపెనింగ్‌లో లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ బాగుంటుందని నా అభిప్రాయం. ఇదే బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఎక్కువ కాలం కొనసాగాలని కోరుకుంటున్నా'' అంటూ తెలిపాడు.

వెస్టిండీస్‌ గడ్డపై విండీస్‌తో భారత్‌ 51 టెస్టులు ఆడింది. 9 టెస్టుల్లో నెగ్గి, 16 టెస్టుల్లో ఓడింది. 26 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి. ఓవరాల్‌గా రెండు జట్ల మధ్య 98 టెస్టులు జరిగాయి. భారత్‌ 22 టెస్టుల్లో నెగ్గి, 30 టెస్టుల్లో ఓడింది. 46 టెస్టులు ‘డ్రా’ అయ్యాయి.  

చదవండి: Asia Cup 2023: జై షాను కలిసిన పీసీబీ చైర్మన్‌.. ఆసియా కప్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)