Breaking News

ఫిఫా ఫైనల్లో స్పెయిన్‌.. ఆ జట్టును మాత్రం ఓడించలేకపోయింది!

Published on Wed, 07/15/2026 - 12:42

ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ జట్టు 16 ఏళ్ల తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్ దశ నుంచి సెమీస్ దాకా తాను తలపడిన అన్ని జట్లను చిత్తు చేసిన స్పెయిన్ కేప్‌వెర్డెను మాత్రం ఓడించకలేకపోయింది. గ్రూప్ దశలో కేప్‌వెర్డెతో మ్యాచ్‌ను స్పెయిన్ 0-0తో డ్రా చేసుకోవడం గమనార్హం. 

దీంతో అనామక జట్టుగా ఫిఫాలో ఎంట్రీ ఇచ్చిన కేప్‌వెర్డె టోర్నీ నుంచి నిష్క్రమించే సమయంలో హీరోలా మారిపోయింది. తన గోల్ కీపింగ్‌​ నైపుణ్యంతో వోజిన్హా స్పెయిన్‌ను నిలువరించడంలో కీలకపాత్ర పోషించాడు. స్పెయిన్ ఆట‌గాళ్లు 27 సార్లు గోల్‌పోస్టుపై దాడులు చేసిన‌ప్ప‌టికీ వాట‌న్నింటిని సమర్థంగా అడ్డుకొని 40 ఏళ్ల వయసులో వోజిన్హా సూపర్‌హీరోగా నిలిచాడు.


Photo Credit: FIFA Twitter

తాజాగా సెమీస్‌లో ఫ్రాన్స్‌పై గెలిచిన తర్వాత స్పెయిన్ ఫుట్‌బాల్ టీం ఒక కామెంట్ చేసింది. ‘ఈ ఫిఫాలో మేము అందరిని నిలువరిస్తే.. మమ్నల్ని మాత్రం కేప్‌వెర్డె నిలువరించింది. ఫ్రాన్స్‌తో సెమీస్ మ్యాచ్ కంటే కేప్‌వెర్డెతో మ్యాచ్ మాకు చాలా కష్టమనిపించింది’ అని పేర్కొనడం ఆసక్తి కలిగించింది.  తాజాగా స్పెయిన్ టీం చేసిన వ్యాఖ్యలతో కేప్‌వెర్డె మరోసారి వార్తల్లో నిలిచింది.

స్పెయిన్ ప్ర‌యాణం సాగింది ఇలా..
ఫిఫా ప్రపంచకప్‌లో లీగ్ దశలో గ్రూప్‌-హెచ్‌లో స్పెయిన్ తొలి మ్యాచ్‌ను కేప్‌వెర్డెతో డ్రా చేసుకుంది. ఆ త‌ర్వాత సౌదీ అరేబియాను 4-0తో చిత్తు చేసింది. లీగ్ ద‌శ‌లో చివ‌రి మ్యాచ్‌లో ఉరుగ్వేను 0-1తో ఓడించిన స్పెయిన్ టేబుల్ టాప‌ర్‌గా రౌండ్ ఆఫ్ 32కు అర్హ‌త సాధించింది. రెండో రౌండ్‌లో ఆస్ట్రియాను 0-3తో ఓడించి స్పెయిన్ పూర్తి ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించి ప్రిక్వార్ట‌ర్స్‌లో అడుగుపెట్టింది. 

ప్రిక్వార్ట‌ర్స్‌లో పోర్చుగల్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆఖ‌రి వ‌ర‌కు గోల్ చేయ‌డంలో స్పెయిన్ విఫ‌ల‌మైంది. అయితే స‌బ్‌స్టిట్యూట్‌గా వ‌చ్చిన మైకెల్ మిరినో స్టాపేజీ టైం (91వ నిమిషం)లో గోల్ చేసి పోర్చుగ‌ల్‌కు పీడ‌క‌ల‌ను మిగిల్చాడు. పోర్చుగ‌ల్‌పై 1-0తో విజ‌యం సాధించిన స్పెయిన్ క్వార్ట‌ర్స్‌లో అడుగుపెట్టింది. ఇక క్వార్ట‌ర్స్‌లో స్పెయిన్ బెల్జియంతో త‌ల‌ప‌డింది. తొలి హాఫ్ ముగిసేస‌రికి 1-1తో స‌మంగా నిలిచాయి. 

అయితే రెండో హాఫ్‌లో బెల్జియం గోల్‌కీప‌ర్ స‌న్నె లామిన్స్ చేసిన చిన్ప త‌ప్పిదం బెల్జియం కొంప‌ముంచింది. స్పెయిన్ ఆట‌గాడు కుబార్సి కొట్టిన బంతిని ఆపే ప్ర‌యత్నంలో లామిన్స్ మిస్ చేయ‌డం, ఇదే అద‌నుగా భావించిన మికెల్ మెరినో బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి త‌ర‌లించి మ‌రోసారి హీరోగా నిలిచాడు. ఫ‌లితంగా స్పెయిన్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత జ‌రిగిదంతా ఒక చ‌రిత్రే. మంగళవారం అర్ధరాత్రి జరిగిన సెమీఫైనల్లో స్పెయిన్ 2-0 తేడాతో ఫ్రాన్స్‌ను మ‌ట్టిక‌రిపించి తుది పోరుకు అర్హ‌త సాధించింది.

 

Read: బుమ్రా గురించి ప్రశ్న... ఇంగ్లండ్ కెప్టెన్ అసహనం!

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)