లంక ఆటగాళ్లతో గొడవ.. వైభవ్‌పై నిషేధం తప్పదా!

Published on Tue, 06/16/2026 - 07:50

శ్రీలంక పర్యటనలో ఉన్న ఇండియా-ఏ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. సోమవారం శ్రీలంక-ఏ జట్టుతో జరిగిన థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో భారత్ ఓటమి చవిచూసింది. అయితే ఈ ఓటమి కంటే వైభవ్ సూర్యవంశీ, శ్రీలంక ఆటగాళ్ల మధ్య జరిగిన గొడవ హైలైట్‌గా నిలిచింది. 

లంక ఆటగాళ్ల తప్పు అటుంచితే, వైభవ్ చేసిన తప్పులకు అతడికి శిక్ష తప్పేలా లేదు. మరి ఈ గొడవతో వైభవ్ సూర్యవంశీపై నిషేధం పడనుందా అనేది ఒకసారి తెలుసుకుందాం. నిజానికి ఒక అంతర్జాతీయ మ్యాచ్‌లో ఒక ఆటగాడు ఇలా గొడవ పడితే ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అది భారీ జరిమానా నుంచి నిషేధం వరకు ఉంటుంది. 

అయితే వైభవ్, లంక ఆటగాదళ్ల మధ్య జరిగిన గొడవ అనధికారిక మ్యాచ్ కిందకు రావడంతో ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం తక్కువగానే ఉంటుంది. కేవలం మ్యాచ్ రిఫరీ నుంచి జరిమానా ఎదుర్కొనేందుకు ఆస్కారముంది. అంతేకాదు బీసీసీఐ కూడా వైభవ్ సూర్యవంశీని మందలించడం లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.

అస‌లేం జ‌రిగింది?
మ్యాచ్‌ ముగిసిన తర్వాత మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్లు స్వల్ప గొడవ జరిగింది. వైభవ్, సూర్యాంశ్‌లను ఉద్దేశించి లంక ఆటగాళ్లు ఏదో అనడంతో క్రికెటర్లు ఒకరిపై మరొకరు దూసుకొచ్చారు. సూర్యాంశ్‌ వైపు వెళుతున్న విశేన్‌ హలంబాగేను వైభవ్‌ అడ్డుకోగా... అతడిని కూడా లంక ఆటగాడు తోసేశాడు. సీనియర్‌ ఆటగాడు డిక్‌వెలా జోక్యం చేసుకొని ఇద్దరినీ విడిపించాల్సి వచ్చింది. తిరిగి వెళుతూ కూడా 15 ఏళ్ల వైభవ్‌ మీ సంగతి చూస్తా అన్నట్లుగా హెచ్చరిస్తూ సైగలు చేయడం కనిపించింది.  

జాతీయ జట్టులో చోటు
ఐపీఎల్‌లో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో 15 ఏళ్ల వయసులోనే టీమిండియాకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. 

శ్రీలంక ప్లేయర్ ను కొట్టబోయిన వైభవ్

ఈ ప్రదర్శనకు మెచ్చిన బీసీసీఐ సెలెక్టర్లు వైభవ్‌ను ఐర్లాండ్‌, ఇంగ్లండ్ టూర్లతో పాటు ఆసియా గేమ్స్‌కు ప్రకటించిన టీమిండియా జట్టుకు ఎంపిక చేసింది. తాజా ఉదంతంతో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రంకు ముందే వైభవ్ సూర్యవంశీ నిషేధం ఎదుర్కోనున్నాడా అనేది చూడాలి. శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్‌లోనూ వైభవ్ సూర్యవంశీ రాణించడంలో విఫలమవుతున్నాడు. 

మూడు మ్యాచ్‌లు కలిపి 69 పరుగులు మాత్రమే చేసిన వైభవ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. టీ20, వన్డే ఫార్మాట్లలో ఒకేలా ఆడుతానంటే కుదరదు.. కొంచెం ఓపిక వహించాల్సిన అవసరముందంటూ అభిమానులు పేర్కొంటున్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)