Breaking News

ట్రోఫీ, మెడ‌ల్స్‌ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్‌.. బీసీసీఐ సీరియ‌స్‌

Published on Mon, 09/29/2025 - 11:41

ఆసియాకప్-2025 ఛాంపియన్స్‌గా టీమిండియా నిలిచిన అనంతరం దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్‌మైదానంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని స్వీకరించడానికి భారత ఆటగాళ్లు నిరాకరించారు.

ప్రోటోకాల్ ప్రకారం.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ బాస్ అయిన మొహ్సిన్ నఖ్వీనే విజేతకు ట్రోఫీ అందించాలి. కానీ భారత్‌-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ట్రోఫీని అతడి నుంచి తీసుకోవాడనికి మెన్ ఇన్ బ్లూ సముఖత చూపలేదు.

దీంతో దాదాపు గంట అలస్యంగా ప్రారంభమైన పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో కేవలం పాక్ ఆటగాళ్లే రన్నరప్ మెడల్స్‌ను అందుకున్నారు. అయితే భారత జట్టు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్-చైర్మన్ ఖలీద్ అల్ జరూని, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చైర్మెన్‌ అమీనుల్ ఇస్లాం చేతుల మీదగా ట్రోఫీని అందుకుంటామని తెలియజేసింది. 

అందుకు వారిద్దరూ అంగీకరించారు. కానీ  మొహ్సిన్ నఖ్వీ మాత్రం తానే అందిస్తానని మొండిపట్టు పట్టాడు. దీంతో టీమిండియా పూర్తిగా ట్రోఫీనే తీసుకోమని తేల్చి చెప్పేసింది. భారత్ తీరుతో సహనం కోల్పోయిన పీసీబీ చీఫ్‌.. ఆసియా కప్ ట్రోఫీతో పాటు, టీమిండియా ఆటగాళ్లకు ఇవ్వాల్సిన మెడల్స్‌ను హోటల్‌కు తీసుకువెళ్లిపోయాడు. 

ఈ క్రమంలో నఖ్వీ వ్యవహరించిన తీరు పట్ల సర్వాత్ర విమర్శల వర్షం కురుస్తోంది. ఇదే విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. మొహ్సిన్ నఖ్వీ చర్యను భారత క్రికెట్ బోర్డు సీరియస్‌గా తీసుకుంటున్నట్లు సైకియా తెలిపారు.

బీసీసీఐ సీరియస్‌..
"భారత్‌-పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికి తెలుసు. పాకిస్తాన్ సీనియర్ లీడర్స్‌లో  ఒకరిగా ఏసీసీ చైర్మెన్ మొహ్సిన్ నఖ్వీ కొనసాగుతున్నారు. అటువంటి అప్పుడు అతడి చేతుల మీదగా ట్రోఫీని ఎలా తీసుకుంటాము?  అత‌డి నుంచి మేము ఆసియా కప్ ట్రోఫీని తీసుకోకూడదని ముందే నిర్ణయించుకున్నాము. 

అత‌డు చేతుల మీద‌గా తీసుకోవడం లేదంటే ట్రోఫీ వద్దని కాదు. ట్రోఫీని, ప‌త‌కాల‌ను హోటల్ గదికి తీసుకువెళ్లే హ‌క్కు ఎవ‌రు ఇచ్చారు? నఖ్వీ నుంచి ఇది అస్స‌లు ఊహించ‌లేదు. అత‌డికి కొంచెం కూడా జ్ఞానం లేదు. ఈ విష‌యంపై మేం ఐసీసీకి ఫిర్యాదు చేస్తాం. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ట్రోఫీ, పతకాలు వీలైనంత త్వరగా భార‌త్‌కు  పంపిస్తారని ఆశిస్తున్నా" అని ఎఎన్ఐతో సైకియా పేర్కొన్నాడు.
చదవండి: అదే మా కొంప‌ముంచింది.. లేదంటే క‌థ మ‌రోలా ఉండేది: పాక్‌ కెప్టెన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)