Breaking News

హార్దిక్‌, రోహిత్‌లకు బీసీసీఐ కీలక ఆదేశాలు.. ఒకవేళ అదే జరిగితే?

Published on Wed, 06/03/2026 - 08:56

అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన ఫిట్‌నెస్‌ను పరీక్షించుకునేందుకు బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (సీఓఈ)కి వెళ్లనున్నాడు. వారం రోజుల పాటు అతను ఇక్కడ ఉండి వివిధ రకాల డ్రిల్స్‌లో పాల్గొనడంతోపాటు ‘మ్యాచ్‌ సిమ్యులేషన్స్‌’లో సాధన చేస్తాడు. ఐపీఎల్‌లో గాయం కారణంగా నాలుగు మ్యాచ్‌లకు దూరమైన అతను కోలుకొని మళ్లీ బరిలోకి దిగాడు.

అయితే భారత వన్డే జట్టులోకి ఎంపిక కావడంలో బీసీసీఐ వైద్య బృందం అతడిని ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సిందిగా సూచించింది. ఫిట్‌గా ఉంటేనే టీమ్‌లో అతని ఎంపిక ఖాయమవుతుంది. దాంతో పాండ్యా సీఓఈకి చేరాడు. పాండ్యాతో పాటు మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను కూడా సీఓఈలో హాజరు కావాలని వైద్యులు చెప్పగా... ఇప్పటి వరకు రోహిత్‌ విషయంలో మాత్రం ఎలాంటి సమాచారం లేదు.  హిట్‌మ్యాన్ ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు.

ఈ గాయం కారణంగానే ఇటీవల ముగిసిన ఐపీఎల్‌-2026లో రోహిత్ నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అంతేకాకుండా ఈ ముంబైకర్ దాదాపు చాలా మ్యాచ్‌లలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. అఫ్గానిస్తాన్‌తో వన్డేలకు రోహిత్ ఎంపికైనప్పటికి.. తన ఫిట్‌నెస్‌ను మాత్రం నిరూపించుకోవాల్సి ఉంది. ఒకవేళ ఫిట్‌నెస్ పరీక్షలో రోహిత్ విఫలమైతే ఈ వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. అతడికి బ్యాకప్‌గా యువ ఓపెనర్ యశస్వి  జైశ్వాల్‌ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ రిజర్వ్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌తో వన్డే సిరీస్ జూన్ 13 నుంచి ప్రారంభం కానుంది.

అఫ్గాన్‌తో వన్డేలకు భారత జట్టు ఇదే:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ(ఫిట్‌నెస్ లోబడి), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.
చదవండి: IND vs AFG: టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌?

 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)