శ్రీలంకతో టెస్టు సిరీస్‌.. భార‌త జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌

Published on Tue, 07/28/2026 - 09:21

శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు బీసీసీఐ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. అగార్కర్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ మంగళవారం 15 మందితో కూడిన జట్టు వివరాలను వెల్లడించింది. లంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, కేఎల్‌ రాహుల్‌ అతడికి డిప్యుటీగా ఉండనున్నాడు. 

ఇక ఏడాది తర్వాత ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా టెస్టుల్లో రీఎంట్రీ ఇవ్వనుండగా, సారాన్ష్‌ జైన్‌ తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక బుమ్రా, సాయి సుదర్శన్‌లను ఎంపిక చేసినప్పటికీ సిరీస్‌ మొదలయ్యే సమయానికి ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఆగస్టు 15 నుంచి 19 మధ్య గాలే వేదికగా, ఆగస్టు 23 నుంచి 27 వరకు కొలంబో వేదికగా రెండో టెస్టు జరగనుంది. అయితే టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ఆగస్టు 7 నుంచి కొలంబో వేదికగా నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది.

ఇంగ్లండ్‌తో సిరీస్ సంద‌ర్భంగా గాయానికి గురైన‌ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ లంక‌తో టెస్టు  సిరీస్‌కు ఎంపిక‌వుతాడ‌ని భావించిన‌ప్ప‌టికీ, అతడి పేరును ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. మ‌రో ఆల్‌రౌండ‌ర్ నితీశ్ రానాతో పాటు పేస‌ర్ హ‌ర్షిత్ రానాలు కూడా గాయాల నుంచి ఇంకా కోలుకోక‌పోవ‌డంతో లంక టూర్‌కు దూర‌మైనట్లు బీసీసీఐ ప్ర‌క‌టించింది.

టెస్టు మ్యాచ్‌ సిరీస్‌:
ఆగస్టు 15-19 వరకు: తొలి టెస్టు, గాలే
ఆగస్టు 23-27 వరకు: రెండో టెస్టు, కొలంబో

భారత జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్‌), సాయి సుదర్శన్*, ధృవ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా*, మహ్మద్‌ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాన్ష్ జైన్.

 

చదవండి: టెస్టు క్రికెట్‌ చ‌రిత్ర‌లో తొలిసారి.. విండీస్ బౌల‌ర్ ప్రపంచ రికార్డు

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)