Breaking News

Ind Vs WI: గడ్డు కాలం.. మంచి రోజులు వస్తాయి! కేకేఆర్‌ స్టార్‌ ట్వీట్‌ వైరల్‌..

Published on Thu, 07/06/2023 - 14:11

WI Vs Ind T20 Series: ఐపీఎల్‌-2023లో అదరగొట్టిన యువ బ్యాటర్లు యశస్వి జైశ్వాల్‌.. మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న తిలక్‌ వర్మ తొలిసారి భారత టీ20 జట్టులో చోటు దక్కించుకున్నారు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ ఆడనున్న టీమిండియాకు ఎంపికయ్యారు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ పదహారో ఎడిషన్‌లో యశస్వి రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.

ఈ ముంబై బ్యాటర్‌ ఆడిన 14 మ్యాచ్‌లలో కలిపి మొత్తం 625 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ కూడా ఉండటం విశేషం. ఇక హైదరాబాదీ క్రికెటర్‌ తిలక్‌ వర్మ విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్‌కు ఆడిన అతడు 11 మ్యాచ్‌లలో 343 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 84 నాటౌట్‌.

ఆ ముగ్గురికి మొం‍డిచేయి
ఈ క్రమంలో వీరిద్దరు భారత జట్టులో చోటు దక్కించుకోవడం విశేషం. అయితే, టీ20 సిరీస్‌ జట్టులో స్థానం ఆశించిన టీమిండియా యువ ఓపెనర్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫినిషర్‌ రింకూ సింగ్‌, పంజాబ్‌ కింగ్స్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మకు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపారు.

దీంతో అభిమానులు సెలక్టర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రింకూ విషయంలో వివక్ష చూపిస్తున్నారంటూ సోషల్‌ మీడియా వేదికగా సెలక్టర్ల తీరును తప్పుబడుతున్నారు. ఇదిలా ఉంటే.. కేకేఆర్‌ కెప్టెన్‌ నితీశ్‌ రాణా చేసిన పోస్టు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

భంగపాటు తప్పదు.. మనకెందుకు భయ్యా!
గతంలో టీమిండియాకు ఆడిన నితీశ్‌ తాజా ట్వీట్‌ చూస్తుంటే.. తాను కూడా జట్టులో చోటు ఆశించినట్లు తెలుస్తోంది. ‘‘గడ్డు కాలమే మంచి రోజులకు పునాది వేస్తుంది’’ అన్న అర్థంలో ఉన్న కోట్‌ను అతడు పంచుకున్నాడు. ఇందుకు స్పందనగా కొంతమంది నితీశ్‌కు మద్దతుగా నిలుస్తుంటే.. మరికొందరు మాత్రం ట్రోలింగ్‌కు దిగారు.

‘‘రింకూ వంటి ప్రతిభ ఉన్న ఆటగాళ్లకే దిక్కులేదు భయ్యా! రుతురాజ్‌ను కూడా పక్కనపెట్టారు. ఇక నీ గురించి ఏం ఆలోచిస్తారు? బుద్ధిగా కేకేఆర్‌కు ఆడుకో! అనవసరంగా ఆశలు పెంచుకుంటే.. భంగపాటు తప్పదు’’ అని నితీశ్‌ను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు.

టీమిండియా తరఫున
కాగా కేకేఆర్‌ తరఫున ఐపీఎల్‌-2023లో రింకూ సింగ్‌ 14 మ్యాచ్‌లలో 474 పరుగులు చేయగా.. కోల్‌కతా సారథి నితీశ్‌ రాణా 413 పరుగులు సాధించాడు. ఇక ఢిల్లీకి చెందిన 29 ఏళ్ల రాణా.. 2021లో శ్రీలంకతో వన్డే మ్యాచ్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.  

అదే ఏడాది టీమిండియా తరఫున టీ20లలోనూ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఈ లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌ భారత్‌ తరఫున ఒక వన్డే, 2 టీ20 మ్యాచ్‌లు ఆడి వరుసగా 7, 15 పరుగులు మాత్రమే చేశాడు.

విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు:
ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), శుబ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్‌ కెప్టెన్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

చదవండి: బౌండరీల వర్షం కురిపించిన రోహిత్‌, జైశ్వాల్‌.. వీడియో వైరల్‌
Ind Vs WI: విఫలమైన కోహ్లి.. 2 పరుగులకే అవుట్‌! వీడియో వైరల్‌

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)