Breaking News

చరిత్ర సృష్టించిన జింబాబ్వే ప్లేయర్‌.. అసాధారణ రికార్డు సొంతం

Published on Thu, 09/04/2025 - 12:22

పొట్టి క్రికెట్‌లో పట్టుమని 10 పరుగులు చేసినా అందులో ఓ సిక్సర్‌ తప్పక ఉంటుంది. అలాంటిది హాఫ్‌ సెంచరీనో లేక ఆపై స్కోరో చేస్తే కనీసం రెండు, మూడు సిక్సర్లైనా ఉంటాయి. పొట్టి ఫార్మాట్‌లో జరిగే ఏ మ్యాచ్‌లో అయినా ఈ తంతు సహజంగా జరుగుతుంటుంది.

అయితే తాజాగా జరిగిన ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో ఓ స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ ఏకంగా 81 పరుగులు చేసినా ఒక్క సిక్సర్‌ కూడా కొట్టలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నిన్న (సెప్టెంబర్‌ 3) శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే ఓపెనర్‌ బ్రియాన్‌ బెన్నెట్‌ 57 బంతులు ఎదుర్కొని ఒక్క సిక్సర్‌ కూడా లేకుండా 12 ఫోర్ల సాయంతో 81 పరుగులు చేశాడు.

ఈ క్రమంలో బెన్నెట్‌ ఓ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఫుల్‌ మెంబర్‌ సభ్య దేశాలు ఆడే అంతర్జాతీయ మ్యాచ్‌లో సిక్సర్‌ లేకుండా అత్యధిక స్కోర్‌ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌, సౌతాఫ్రికా మాజీ కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ పేరిట సంయుక్తంగా ఉండేది.

బాబర్‌, ఫాఫ్‌ ఇద్దరూ గతంలో సిక్సర్‌ లేకుండా 79 పరుగులు చేశారు. ఈ రికార్డు జాబితాలో రికీ పాంటింగ్‌ లాంటి డాషింగ్‌ బ్యాటర్‌ కూడా ఉండటం విశేషం. అన్ని ఐసీసీ సభ్య దేశాలన్నిటీ పరిగణలోకి తీసుకుంటే ఈ రికార్డు మాల్వాయ్‌కు చెందిన సామి సోహైల్‌ పేరిట ఉంది. 2022లో అతను లెసోధోపై సిక్సర్‌ లేకుండా 94 పరుగులు చేశాడు.

ఒంటరి పోరాటం​
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బెన్నెట్‌ ఒంటరిపోరాటం చేశాడు. జట్టులో మిగతా ఏ బ్యాటర్‌ ఓ మోస్తరు స్కోరైనా చేయలేకపోగా.. బెన్నెట్‌ ఒక్కడే దాదాపు సెంచరీ (87) చేసినంత పని చేశాడు. బెన్నెట్‌ రికార్డు ఇన్నింగ్స్‌ కారణంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే ఓ మోస్తరుకు మించిన స్కోర్‌ (175/7) చేసింది.

అనంతరం బౌలర్లు మ్యాచ్‌ మొత్తం కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసినా ఒక్క ఓవర్‌ జింబాబ్వే కొంపముంచింది. మపోసా వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో కమిందు మెండిస్‌ 26 పరుగులు పిండుకుని శ్రీలంకను గెలిపించాడు. అంతకుముందు ఓపెనర్లు పథుమ్‌ నిస్సంక (55), కుసాల్‌ మెండిస్‌ (38) ఆడిన ఇన్నింగ్స్‌లు కూడా లంక గెలుపుకు దోహదపడ్డాయి.

ఈ గెలుపుతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో పర్యాటక శ్రీలంక 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 సెప్టెంబర్‌ 6న జరుగనుంది. దీనికి ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను శ్రీలంక క్లీన్‌ స్వీప్‌ చేసింది.

 

Videos

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

Photos

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు