Breaking News

శుభ్‌మన్ గిల్ సరసన బాబర్ ఆజం.. వన్డేల్లో అరుదైన రికార్డులు

Published on Wed, 10/21/2026 - 10:27

పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఒక దేశంలో  అత్యంత వేగంగా (పాక్‌లో, 37 ఇన్నింగ్స్‌లు)  2000 వన్డే పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ల జాబితాలో డికాక్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో భారత యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (భారత్‌లో, 33) అగ్రస్థానంలో ఉండగా.. వెస్టిండీస్ మాజీ బ్యాటర్ డెస్మండ్ హేన్స్ (వెస్టిండీస్‌లో, 36) రెండో స్థానంలో ఉన్నాడు. 

పై రికార్డు సాధించే క్రమంలో బాబర్‌ మరో ఘనత కూడా సొంతం​ చేసుకున్నాడు. స్వదేశంలో అత్యంత వేగంగా (37 ఇన్నింగ్స్‌లు) 2000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గానూ నిలిచాడు. ఈ జాబితాలో ఇంజమామ్‌ (48), మొహమ్మద్‌ యూసఫ్‌ (49), షోయబ్‌ మాలిక్‌ (56) బాబర్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. స్వదేశంలో జరుగుతున్న ట్రై సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్‌ పై రెండు ఘనతలను సాధించాడు.

ఈ మ్యాచ్‌లో బాబర్‌ 52 బంతుల్లో 34 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో పాక్‌ ఇంగ్లండ్‌ను 87 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. అరాఫత్‌ మిన్హాస్‌  ఆల్‌రౌండర్‌ షోతో (59, 6-40) ఇరగదీసి పాక్‌కు అద్భుత విజయాన్నందించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ (302-9) చేసిన పాక్‌, ఆతర్వాత బౌలింగ్‌లో మరింతగా చేలరేగి ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది (215 ఆలౌట్‌).  

ఇదీ చదవండి: ఆల్‌రౌండర్‌ షోతో ఇరగదీసిన పాక్‌ ప్లేయర్‌


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)