Breaking News

పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌!

Published on Sat, 09/20/2025 - 10:51

ఆసియా కప్‌-2025 టోర్నమెంట్‌ లీగ్‌ దశను టీమిండియా అజేయంగా ముగించింది. ఆఖరిగా శుక్రవారం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలిచి.. గ్రూప్‌-ఎ టేబుల్‌ టాపర్‌గా తన స్థానాన్ని నిలుపుకొంది. తదుపరి సూపర్‌-4 దశలో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా భారత్‌.. దాయాది పాకిస్తాన్‌తో తలపడేందుకు షెడ్యూల్‌ ఖరారైంది.

అయితే, దుబాయ్‌ వేదికగా ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. ఒమన్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ (Axar Patel Injury) గాయపడ్డాడు. భారత్‌ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్‌ వన్‌డౌన్‌ బ్యాటర్‌ మహ్మద్‌ మీర్జా (33 బంతుల్లో 51) దూకుడగా ఆడాడు.

మైదానానికి బలంగా కొట్టుకున్న తల
ఈ క్రమంలో పదిహేనో ఓవర్లో శివం దూబే (Shivam Dube) బౌలింగ్‌లో మీర్జా బంతిని గాల్లోకి లేపగా.. మిడాఫ్‌ నుంచి పరిగెత్తుకుని వచ్చిన అక్షర్‌.. క్యాచ్‌ పట్టేందుకు విఫలయత్నం చేశాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కిందపడిన అక్షర్‌ తల మైదానానికి బలంగా కొట్టుకుంది.

దీంతో ఫిజియో వచ్చి పరీక్షించి.. అతడిని మైదానం నుంచి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత అక్షర్‌ మళ్లీ ఫీల్డింగ్‌కు రాలేదు. అయితే, ఈ విషయం గురించి స్పందించిన భారత జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ టి.దిలీప్‌ అప్‌డేట్‌ అందించాడు. అక్షర్‌ పటేల్‌ బాగానే ఉన్నాడని చెప్పాడు.

స్పష్టత లేదు
కానీ అక్షర్‌ గాయం తీవ్రతపై పూర్తి స్పష్టతనివ్వలేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందిగ్దత నెలకొంది. 

కాగా యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఆసియా కప్‌ టోర్నీలో భారత్‌ లీగ్‌ దశలో మూడింటికి మూడు గెలిచింది. యూఏఈ, పాకిస్తాన్‌, ఒమన్‌లను ఓడించి అజేయంగా నిలిచింది. ఇక స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు రెండు వికెట్లు తీయడంతో పాటు.. 26 పరుగులు సాధించాడు.  

చదవండి: Asia Cup 2025 Super 4: సూపర్‌-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్‌, టైమింగ్‌ వివరాలు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)