Breaking News

Asia Cup: పూర్తి షెడ్యూల్‌ విడుదల.. భారత్‌- పాక్‌ మ్యాచ్‌ల తేదీలివే!

Published on Sat, 07/26/2025 - 21:04

Asia Cup 2025: ఆసియా కప్‌-2025 నిర్వహణకు మార్గం సుగమమైంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే టోర్నమెంట్‌కు సంబంధించి ఆసియా క్రికెట్‌ మండలి (ACC) శనివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 వరకు ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

మూడుసార్లు ఢీకొట్టే అవకాశం!
చిరకాల ప్రత్యర్థులు భారత్‌- పాకిస్తాన్‌ (India vs Pakistan) జట్లు సెప్టెంబరు 14న పరస్పరం తలపడనున్నాయి. దాయాదులు రెండూ ఒకే గ్రూపులో ఉన్నాయి కాబట్టి సూపర్‌ ఫోర్‌ దశలో మరోసారి అంటే.. సెప్టెంబరు 21న ఢీకొట్టే వీలుంది. ఒకవేళ ఇరుజట్లు ఫైనల్‌ చేరితో సెప్టెంబరు 28న మరోసారి ముఖాముఖి పోటీపడతాయి.

గ్రూప్‌- ఎ నుంచి ఇండియా, పాకిస్తాన్‌, యూఏఈ, ఒమన్‌ పోటీపడనుండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గనిస్తాన్‌, హాంకాంగ్‌ గ్రూప్‌-బి నుంచి తలపడతాయి. దుబాయ్‌, అబుదాది వేదికలుగా ఈ 19 మ్యాచ్‌ల టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు.

బీసీసీఐపై విమర్శలు
కాగా ఆసియా కప్‌ టీ20 టోర్నీకి ఈసారి భారత్‌ వేదిక. అయితే, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం గతంలో మాదిరి ఈసారి కూడా తటస్థ వేదికపై టోర్నీని నిర్వహించనున్నారు. అయితే, పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో అన్ని స్థాయిల్లోనూ క్రీడల్లోనూ బంధం తెంచుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. బీసీసీఐ సైతం దాయాదితో పోటీ పడేందుకు సుముఖంగా లేమని వెల్లడించింది.

కానీ.. తాజా షెడ్యూల్‌ ప్రకారం చిరకాల ప్రత్యర్థితో టీమిండియా తలపడనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీరుపై విమర్శలు వస్తున్నాయి. కాగా ఇటీవల వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ లీగ్‌లో పాక్‌తో మ్యాచ్‌ ఆడేందుకు ఇండియా చాంపియన్స్‌ నిరాకరించింది. దీంతో ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ రద్దు కాగా.. చెరో పాయింట్‌ వచ్చింది.

లీగ్‌ దశ షెడ్యూల్‌
👉సెప్టెంబరు 9: అఫ్గనిస్తాన్‌ వర్సెస్‌ హాంగ్‌కాంగ్‌
👉సెప్టెంబరు 10: ఇండియా వర్సెస్‌ యూఏఈ
👉సెప్టెంబరు 11: బంగ్లాదేశ్‌ వర్సెస్‌ హాంగ్‌కాంగ్‌
👉సెప్టెంబరు 12: పాకిస్తాన్‌ వర్సెస్‌ ఒమన్‌
👉సెప్టెంబరు 13: బంగ్లాదేశ్‌ వర్సెస్‌ శ్రీలంక
👉సెప్టెంబరు 14: ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌
👉సెప్టెంబరు 15: యూఏఈ వర్సెస్‌ ఒమన్‌
👉సెప్టెంబరు 15:శ్రీలంక వర్సెస్‌ హాంగ్‌కాంగ్‌
👉సెప్టెంబరు 17: పాకిస్తాన్‌ వర్సెస్‌ యూఏఈ
👉సెప్టెంబరు 18: శ్రీలంక వర్సెస్‌ అఫ్గనిస్తాన్‌
👉సెప్టెంబరు 19: ఇండియా వర్సెస్‌ ఒమన్‌

సూపర్‌ 4 దశ
👉సెప్టెంబరు 20: గ్రూప్‌- బి టాపర్‌ వర్సెస్‌ రెండో స్థానంలో ఉన్న జట్టు (B1 Vs B2)
👉సెప్టెంబరు 21: గ్రూప్‌-ఎ టాపర్‌ వర్సెస్‌ రెండో స్థానంలో ఉన్న జట్టు (A1 vs A2)
👉సెప్టెంబరు 23: A2 vs B1
👉సెప్టెంబరు 24: A1 vs B2
👉సెప్టెంబరు 25: A2 vs B2
👉సెప్టెంబరు 26: A1 vs B1
👉సెప్టెంబరు 28: ఫైనల్‌.

చదవండి: IND vs AUS: ధావన్‌ ధనాధన్‌.. పఠాన్‌ విధ్వంసం.. యువీ మాత్రం విఫలం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)