Breaking News

అర్జెంటీనా దిగ్గ‌జం కన్నుమూత.. విషాదంలో మెస్సీ సేన‌

Published on Sun, 07/12/2026 - 12:39

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గ‌జ ఆట‌గాడు, మాజీ కెప్టెన్ ఆంటోనియో ఉబాల్డో రాటిన్ (89) భారత కాలమన ప్రకారం ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఫుట్‌బాల్‌లో ఎల్లో, రెడ్ కార్డుల వ్యవస్థను ప్రవేశపెట్టడంలో ఆంటోనియో రాటిన్‌ కీలక పాత్ర పోషించారు. 

ఆదివారం ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో అర్జెంటీనా క్వార్టర్ ఫైన‌ల్లో స్విట్జ‌ర్లాండ్‌ను ఓడించి సెమీస్‌లో అడుగుపె ట్టింది. ఆంటోనియో మృతి ప‌ట్ల అర్జెంటీనా జ‌ట్టు సంఘీభావం ప్ర‌క‌టించి ఆయ‌న మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించింది. స్విస్‌తో మ్యాచ్‌కు అర్జెంటీనా ఆటగాళ్లు నల్లరిబ్బన్లతో బరిలోకి దిగారు.

రెడ్‌, యెల్లో కార్డుల‌కు ఆద్యుడు
1966లో ఇంగ్లండ్‌లో జరిగిన ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఆంటోనియో రాటిన్‌ను జ‌ర్మ‌న్ రెఫరీ రుడాల్ఫ్ క్రీట్‌లీన్ బ‌ల‌వంతంగా మైదానం నుంచి బయటకు పంప‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది. అయితే ఆ స‌మ‌యంలో కార్డుల విధానం లేకపోవడంతో ఆంటోనియో మైదానం వీడ‌కుండా త‌న‌కు అన్యాయం చేశారంటూ మైదానంలోనే కూర్చొని నిర‌స‌న‌కు దిగారు. ఈ సంఘటన ఫుట్‌బాల్ చరిత్రలో ఒక మలుపు తీసుకువచ్చింది. బ్రిటన్ రాణి కోసం ప్రత్యేకంగా పరిచిన రెడ్ కార్పెట్‌పై కూర్చొని నిరసన తెలపడంతో పెద్ద చర్చకు దారితీసింది.

దెబ్బ‌కు దిగొచ్చిన ఫిఫా
దీంతో మ‌రుస‌టి (1970) ప్రపంచకప్ నుంచి రెడ్, ఎల్లో కార్డుల విధానాన్ని ఫిఫా అధికారికంగా ప్రవేశపెట్టింది. ఈ విధానం ద్వారా ఆటగాళ్లకు రెఫరీ నిర్ణయాలు స్పష్టంగా తెలియజేయబడటానికి మార్గం సుగమం అయ్యింది. ఇక రాటిన్ తన కెరీర్‌ను 'బోకా జూనియర్స్' క్లబ్‌కు అంకితం చేశారు, అక్కడ 1956 నుంచి 1970 వరకు 382 మ్యాచ్‌లు ఆడి, నాలుగు లీగ్ టైటిళ్లను గెలుచుకున్నారు. 1962, 1966 ప్రపంచకప్పుల్లో అర్జెంటీనా తరఫున ప్రాతినిధ్యం వహించారు.

ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత ఆంటోనియో రాటిన్‌ కోచ్‌గా, రాజకీయ నాయకుడిగా కూడా ఆయన తన ప్రతిభను ప్రదర్శించారు. మైదానంలో తన అంకితభావం, దేశం పట్ల గర్వంతో ఆడిన గొప్ప ఆటగాడిగా ఫుట్‌బాల్ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన మృతితో, ఫుట్‌బాల్ ప్రపంచం ఒక గొప్ప ఆటగాడిని కోల్పోయింది. రాటిన్ క్రీడా ప్రస్థానం, ఆయన చేసిన మార్పులు, ఫుట్‌బాల్‌కు ఆయ‌న అందించిన సేవ‌లు చిర‌కాలం గుర్తుండిపోతాయ‌న‌డంలో సందేహం లేదు.

 

 

 

Read: చరిత్ర సృష్టించిన మెస్సీ.. మారడోనా రికార్డు బద్దలు

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)