మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్
Breaking News
ఆఖరి నిమిషాల్లో మూడు గోల్స్.. క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా
Published on Tue, 07/07/2026 - 23:42
ఫిఫా ప్రపంచకప్ 2026లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అర్జెంటీనా 3-2తో ఈజిప్ట్‌ను మట్టికరిపించింది. అర్జెంటీనా తరఫున క్రిస్టియన్ రోమెరో (79వ నిమిషం), లియోనల్ మెస్సీ (83వ నిమిషం), యెంజో ఫెర్నాండేజ్ (90+3వ నిమిషం) ఆట ఆఖరి నిమిషంలో మూడు గోల్స్ కొట్టారు.

మరోవైపు ఈజిప్ట్ తరఫున యాసర్ ఇబ్రహీం (15వ నిమిషం), మొస్తాఫా జికో (67వ నిమిషం) గోల్స్ సాధించారు. ఇక మెస్సీకి ఈ ఫిఫాలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఇది 8వ గోల్ కావడం విశేషం. ప్రస్తుతం ఎంబాపెను దాటిన మెస్సీ 8 గోల్స్‌తో గోల్డెన్ బూట్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
అర్జెంటీనాకు ఈజిప్ట్ చుక్కలు
ఇక మ్యాచ్‌లో అర్జెంటీనాకు ఈజిప్ట్ ముచ్చెమటలు పట్టించింది. తొలి హాఫ్ ముగిసేసరికి ఈజిప్ట్ ఒక గోల్ కొట్టి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో హాఫ్లోనూ 67వ నిమిషంలో ముస్తాఫా జీకో రెండో గోల్ కొట్టడంతో ఈజిప్ట్ 2-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక మ్యాచ్‌లో అర్జెంటీనా ఓడిపోతుందా? విజయం ఈజిప్ట్దేనా అనే అనుమానాలు రేకెత్తాయి.

ఆఖర్లో హైడ్రామా
అర్జెంటీనా మ్యాచ్ ఓడిపోతుందా అన్న సమయంలో అసలు డ్రామా మొదలైంది. మరో 15 నిమిషాల్లో ఫుల్‌టైమ్ ముగుస్తుందనగా, అర్జెంటీనా స్ట్రైకర్ క్రిస్టియన్ రొమెరో తొలి గోల్‌తో మెరిశాడు. రైట్ కార్నర్ నుంచి మెస్సీ అందించిన బంతిని బులెట్ హెడర్‌తో క్రిస్టియన్ రొమెరో నేరుగా గోల్ పోస్ట్‌లోకి తరలించాడు.

ఇక 83వ నిమిషంలో మెస్సీ బంతిని నేరుగా గోల్‌పోస్ట్‌లోకి తరలించి స్కోరును 2-2తో సమం చేశాడు. 90 నిమిషాలు ముగియడంతో ఇంజ్యూరీ టైమ్ మొదలైంది. 90+3వ నిమిషంలో ఈసారి యెంజో ఫెర్నాండేజ్ హెడర్‌తో బంతిని గోల్‌పోస్ట్‌లోకి తరలించడంతో 3-2తో అర్జెంటీనా ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత ఈజిప్ట్ పలుమార్లు గోల్‌పోస్ట్‌పై దాడులు చేసినప్పటికీ లాభం లేకపోయింది.
🚨 GOAL ARGENTINA!
LIONEL MESSI EQUALIZES IN THE 83RD MINUTE! 🇦🇷⚽ pic.twitter.com/U0jkSMkgsT— FIFA World Cup 2026 (@FIFAWC26Updates) July 7, 2026
THIS IS WHAT IT MEANS! 💙🥺pic.twitter.com/tvg4ujENTt
— BarçaTimes (@BarcaTimes) July 7, 2026
Tags : 1