ఫిఫా చరిత్రలో తొలిసారి.. సెంటిమెంట్‌తో బరిలోకి అర్జెంటీనా!

Published on Tue, 07/14/2026 - 11:08

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో అర్జెంటీనా, ఇంగ్లండ్ మ‌ధ్య జూన్ 16న అట్లాంటా వేదిక‌గా రెండో సెమీఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. ఇప్పటికే ఇరుజ‌ట్లు త‌మ ప్రాక్టీస్‌ను ముమ్మ‌రం చేశాయి. అయితే ఇంగ్లండ్‌తో సెమీఫైన‌ల్లో అర్జెంటీనా ప్ర‌త్యేక జెర్సీ కిట్‌తో బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. ఈ నేవీ బ్లూ జెర్సీతోనే అర్జెంటీనా ఫిఫా చరిత్రలో రెండు అద్భుతాలకు నాంది పలికింది

ఇంగ్లండ్‌పై మాన‌సికంగా పైచేయి సాధించాల‌నే ఉద్దేశంతో సెమీస్ రోజున అర్జెంటీనా ఆట‌గాళ్లు నేవీ బ్లూ జెర్సీని ధ‌రించ‌నున్నారు.దీనికి సంబంధించి ఇప్ప‌టికే అర్జెంటీనా ఫిఫా నుంచి అనుమ‌తి కూడా పొందింది. ప్ర‌తీ ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో అర్జెంటీనా ఒక మ్యాచ్‌ను నేవీ బ్లూ జెర్సీతో ఆడ‌డం ఆన‌వాయితీగా చేసుకుంది. ఈ ఫిఫాలో ఇప్ప‌టికే జోర్డాన్‌తో మ్యాచ్‌లో అర్జెంటీనా ఆట‌గాళ్లు నేవీ బ్లూ జెర్సీతో బ‌రిలోకి దిగారు. 


Photo Credit: FIFA Twitter

ఇంగ్లండ్‌తో సెమీస్ సంద‌ర్భంగా త‌మ‌కు రెండోసారి నేవీ బ్లూ జెర్సీ ధ‌రించే అవ‌కాశం ఇవ్వాల‌ని అర్జెంటీనా ఫిఫాను అభ్య‌ర్థించింది. తాజాగా ఫిఫా నుంచి అనుమ‌తి రావ‌డంతో అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీకి లైన్ క్లియ‌ర్ అయింది. సెమీస్‌లో అర్జెంటీనా ఆట‌గాళ్లు నేవీ బ్లూ జెర్సీ, న‌ల్లరంగు షార్ట్‌ను ధ‌రించ‌నుండ‌గా.. ఇంగ్లండ్ వైట్ అండ్ వైట్‌లో బరిలోకి దిగ‌నుంది.

జెర్సీ వెనుక పెద్ద క‌థే..
అర్జెంటీనా ప్ర‌తి ఫిఫాలో నేవీ బ్లూ జెర్సీతో ఒక మ్యాచ్ ఆడ‌డం వెనుక పెద్ద క‌థే దాగుంది. 1986 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో క్వార్ట‌ర్ ఫైన‌ల్లో అర్జెంటీనా, ఇంగ్లండ్ త‌ల‌ప‌డ్డాయి. అప్ప‌ట్లో ఇద్ద‌రి జెర్సీ రంగు దాదాపు ఒకే విధంగా ఉండ‌డంతో జ‌ట్ల మ‌ధ్య తేడా ఉండాల‌ని అర్జెంటీనా నేవీ బ్లూ క‌ల‌ర్ జెర్సీతో బ‌రిలోకి దిగింది.  ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా 2-1 తేడాతో ఇంగ్లండ్‌పై విజ‌యం సాధించింది. మెక్సికో వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లోనే మార‌డోనా 'హ్యాండ్ ఆఫ్ గాడ్' తో పాటు 'గోల్ ఆఫ్ ది సెంచ‌రీ' న‌మోదు చేశాడు.


Photo Credit: FIFA Twitter

ఆ మ్యాచ్‌కు గుర్తుగా తాజా ఫిఫాలో సెమీస్‌లో మ‌రోసారి ఇంగ్లండ్‌తో త‌ల‌ప‌డుతున్న వేళ అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీతో ఆడాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇది మాన‌సికంగా ఇంగ్లండ్‌పై తమ‌కు విజ‌యం సాధించిన‌ట్ల‌వుతుంద‌ని అర్జెంటీనా అభిప్రాయ‌ప‌డుతుంది. 1986 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో అర్జెంటీనా విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌రో రెండుసార్లు అర్జెంటీనా, ఇంగ్లండ్‌లు త‌ల‌ప‌డ్డాయి. ఈ రెండుసార్లు కూడా అర్జెంటీనా నేవీ బ్లూ జెర్సీతోనే బ‌రిలోకి దిగ‌డం విశేషం. 

1998 ఫిఫాలో పెనాల్టీ షూటౌట్‌లో అర్జెంటీనా 4-3తో ఇంగ్లండ్‌పై విజ‌యాన్ని అందుకుంది. ఇక 2002 ఫిఫాలో డేవిడ్ బెక్‌హ‌మ్ మెరుపుల‌తో ఇంగ్లండ్ 1-0 తేడాతో అర్జెంటీనాపై విజ‌యం సాధించింది. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు ఇరుజ‌ట్లు నాకౌట్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నుండ‌డంతో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది.


Photo Credit: FIFA Twitter

హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్‌
'హ్యాండ్ ఆఫ్ గాడ్' అనేది 1986 ఫిఫా ప్రపంచ కప్ క్వార్టర్-ఫైనల్‌లో అర్జెంటీనా ఆటగాడు డియెగో మారడోనా ఇంగ్లాండ్‌పై చేసిన వివాదాస్పద గోల్. అతను ఇంగ్లాండ్ గోల్ కీపర్ కంటే ఎత్తున ఎగిరి, బంతిని తన ఎడమ చేతితో గోల్ పోస్ట్‌లోకి నెట్టాడు. రిఫరీలు దీన్ని గమనించకపోవడంతో గోల్ చెల్లుబాటయింది. ఆ తర్వాత మారడోనా కొట్టిన గోల్‌ను హ్యాండ్ ఆఫ్ గాడ్‌గా అభివర్ణించారు.


Photo Credit: FIFA Twitter

గోల్ ఆఫ్ ది సెంచరీ
ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమమైన గోల్‌గా పేరొందిన "గోల్ ఆఫ్ ది సెంచరీ"ని 1986 జూన్ 22న అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా సాధించాడు. మెక్సికోలో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, మారడోనా దాదాపు 60 మీటర్ల దూరం నుంచి ఐదుగురు ఇంగ్లాండ్ ఆటగాళ్లను దాటుకుంటూ వెళ్లి ఈ అద్భుతమైన గోల్ చేయడం చరిత్రలో నిలిచిపోయింది. అందుకే దీనిని గోల్ ఆఫ్ ది సెంచరీగా అభివర్ణించారు.

చదవండి: చెన్నై వేదిక‌గా తొలి మ్యాచ్‌.. బిగ్‌బాష్‌ లీగ్‌ షెడ్యూల్‌ విడుదల

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)