Breaking News

సెమీస్‌కు దూసుకెళ్లిన అనాహత్‌.. తొలి భారత ప్లేయర్‌గా చరిత్ర

Published on Fri, 10/23/2026 - 10:32

అమెరికాలోని రెడ్‌వుడ్‌ సిటీలో జరుగుతున్న సిలీకాన్‌ వ్యాలీ ఓపెన్‌ గోల్డ్‌ లెవెల్‌ అంతర్జాతీయ టోర్నీలో భారత స్క్వాష్ సంచ‌ల‌నం అనాహత్‌ సింగ్ సెమీఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. శుక్ర‌వారం జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్లో ప్ర‌పంచ 15వ ర్యాంకర్‌  అనాహ‌త్ 3-2( 4-11, 11-8,4-11, 11-2, 11-5) తేడాతో ప్రపంచ 14వ ర్యాంకర్‌ సల్మా హనీ (ఈజిప్ట్‌)ని చిత్తుగా ఓడించింది.

త‌ద్వారా గోల్డ్ లెవెల్ టోర్నీలో సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి భార‌త ప్లేయ‌ర్‌గా అనాహ‌త్ సింగ్ చ‌రిత్ర సృష్టించింది. ఇక సెమీస్‌లో అనాహ‌త్.. మ‌లేషియాకు చెందిన ప్ర‌పంచ నాలుగో ర్యాంక‌ర్ శివ‌సంగారి సుబ్ర‌మ‌ణియ‌మ్‌ను ఎదుర్కోనుంది. కాగా ఇటీవ‌లే జ‌రిగిన‌ ఆసియా గేమ్స్‌లో అనాహ‌త్ ఫైన‌ల్లో సుబ్ర‌మ‌ణియ‌మ్ చేతిలో ఓట‌మిపాలై ర‌జతానికి ప‌రిమిత‌మైంది.

అంత‌క‌ముందు గురువారం ఉదయం జరిగిన రెండో రౌండ్‌లో అనాహ‌త్ త‌న కెరీర్‌లోనే అతిపెద్ద, అతిగొప్ప విజయాన్ని నమోదు చేసుకుంది. ఈజిప్ట్‌ దిగ్గజం, వరుసగా 8 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నూర్‌ ఎల్‌ షెర్బినిపై అనాహత్‌ వరుస గేముల్లో గెలిచి పెను సంచలనం సృష్టించింది. 

రెండో రౌండ్‌లో అనాహత్‌ ఈ అద్భుతం చేసింది. 18 ఏళ్ల అనాహత్‌ 30 నిమిషాల్లో 11–8, 11–8, 11–7తో టాప్‌ సీడ్, ప్రపంచ 3వ ర్యాంకర్‌ నూర్‌ షెర్బినిని బోల్తా కొట్టించి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

 

ఇదీ చదవండి: 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)