భారత్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌కు సర్వం సిద్దం..ఇరు జట్ల ప్రాక్టీస్‌

Published on Wed, 01/24/2024 - 07:42

భాగ్యనగరం వాకిట్లో క్రికెట్‌ పండుగ వచ్చేసింది. అభిమానులందరికీ ప్రపంచ క్రికెట్‌లోని అగ్రశ్రేణి ఆటగాళ్లు తమ ఆటతీరుతో కనువిందు చేయడానికి ‘సై’ అంటున్నారు. గురువారం నుంచి ఉప్పల్‌ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లండ్‌ జట్లు టెస్టు సమరానికి సిద్ధమయ్యాయి. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఈనెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో జరగనుండగా..రెండో టెస్టుకు ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు విశాఖపట్నం ఆతిథ్యమివ్వనుంది.

ఉప్పల్‌ స్టేడియంలో భారత జట్టు ఇప్పటి వరకు ఆరు టెస్టులు ఆడింది. ఇందులో నాలుగు టెస్టుల్లో గెలుపొంది, ఒక టెస్టును ‘డ్రా’ చేసుకుంది. ఈ మైదానంలో భారత జట్టు తమ అజేయ రికార్డును కొనసాగించాలని మరో విజయాన్ని తమ ఖాతాలో జమ చేసుకోవాలని ఆశిద్దాం.  

కోహ్లి లేడు..
వ్యక్తిగత కారణాలరీత్యా భారత స్టార్‌ విరాట్‌ కోహ్లి తొలి రెండు టెస్టులకు దూరం కావడం తెలుగు క్రికెట్‌ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే అంశం. అయితే రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్, శుభ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాట్‌తో... జస్‌ప్రీత్‌ బుమ్రా, సిరాజ్‌ వాడివేడి పేస్‌తో..అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్, కుల్దీప్‌ యాదవ్‌ తమ స్పిన్‌ మాయాజాలంతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఇటీవల కాలంలో టెస్టుల్లోనూ టి20 తరహా దూకుడైన ఆటతో అదరగొడుతున్న ఇంగ్లండ్‌ జట్టు భారత గడ్డపై అదే జోరు కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ఇంగ్లండ్‌ బృందంలో బెన్‌ స్టోక్స్, జో రూట్, బెయిర్‌స్టో, ఒలీ పాప్, జేమ్స్‌ అండర్సన్, మార్క్‌ వుడ్‌ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు.  

లోకల్‌ స్టార్‌ సిరాజ్‌ రె‘ఢీ’..
ఇప్పటికే భారత్, ఇంగ్లండ్‌ జట్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. మంగళవారం రెండు జట్లు ముమ్మరంగా సాధన చేశాయి. ‘లోకల్‌ స్టార్‌’ మొహమ్మద్‌ సిరాజ్‌ సొంత మైదానంలో తొలి టెస్టు ఆడటం ఖాయమైంది. ఇప్పటి వరకు సిరాజ్‌ 23 టెస్టులు ఆడాడు. ఇందులో 6 టెస్టులు (చెన్నై, అహ్మదాబాద్, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, ఇండోర్‌) భారత గడ్డపై, మిగతా 17 టెస్టులు విదేశాల్లో ఆడాడు.  

వ్యూహ రచనలో జడేజా, అశ్విన్‌..
టీమిండియా స్పిన్‌ ద్వయం​ రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్ల భరతం పట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ఉప్పల్‌ పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో వీరిద్దరు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంగ్లండ్‌ను రెండు ఇన్నింగ్స్‌ల్లో మడతపట్టేందుకు వీరిద్దరూ కఠోరంగా సాధన చేస్తున్నారు. 

ఇంగ్లండ్‌ ఆటగాళ్లు సైతం..
భారత్‌ను స్వదేశంలో ఓడించాలంటే ఎంత కష్టమో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బాగా తెలుసు. అందుకే వారు మూడు రోజుల ముందుగానే తొలి టెస్ట్‌ వేదిక అయిన హైదరాబాద్‌కు చేరుకుని కఠోరంగా సాధన చేస్తున్నారు. 

అనుభవమే ఆయుధంగా..
భారత్‌పై ఆడిన అనుభవం ఎక్కువగా ఉన్న వెటరన్‌ పేసర్‌ ఆండర్సన్‌ అందరికంటే ఎక్కువగా ప్రాక్టీస్‌ చేస్తూ చెమటోడుస్తున్నాడు. ఈ సిరీస్‌లో టీమిండియాను ఇబ్బంది పెట్టే బౌలర్‌ ఎవరైనా ఉన్నారా అంటే అది ఆండర్సనే​ అని చెప్పాలి. అతని అనుభవం ముందు టీమిండియా బ్యాటర్లు నిలబడతారో లేక ఆండర్సన్‌ కెరీర్‌కు చేదు అనుభవంతో ముగింపు పలుకుతారో వేచి చూడాలి.

నాడు ప్లేయర్‌గా... నేడు కోచ్‌గా..
2010లో ఉప్పల్‌ స్టేడియంలోనే భారత్‌తో జరిగిన టెస్టులో న్యూజిలాండ్‌ జట్టు తరఫున ‘డబుల్‌ సెంచరీ’ సాధించిన బ్రెండన్‌ మెకల్లమ్‌ ప్రస్తుతం ఇంగ్లండ్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌గా మళ్లీ హైదరాబాద్‌కు రావడం విశేషం. 

Videos

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)