Breaking News

జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా

Published on Mon, 11/03/2025 - 07:31

తొలిసారి వన్డే ప్రపంచకప్‌ (Women's Cricket World Cup 2025 Winner Prize Money) గెలిచిన భారత మహిళా క్రికెట్‌ జట్టుకు (Team India) భారీ నజరానా (Prize Money) లభించింది. జగజ్జేత భారత్‌కు రికార్డు స్థాయిలో 44 లక్షల 80 వేల డాలర్లు (రూ. 39 కోట్ల 80 లక్షలు) ప్రైజ్‌మనీ అందింది. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టుకు 22 లక్షల 40 వేల డాలర్లు (రూ. 19 కోట్ల 90 లక్షలు) లభించాయి.

సెమీఫైనల్లో ఓడిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్ల ఖాతాలో 11 లక్షల 20 వేల డాలర్ల (రూ. 9 కోట్ల 94 లక్షలు) చొప్పున చేరాయి. ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన శ్రీలంక, న్యూజిలాండ్‌ జట్లకు 7 లక్షల డాలర్ల (రూ. 6 కోట్ల 21 లక్షలు) చొప్పున... ఏడు, ఎనిమిదో స్థానాల్లో నిలిచిన బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ జట్లకు 2 లక్షల 80 వేల డాలర్ల (రూ. 2 కోట్ల 48 లక్షలు) చొప్పున లభించాయి.

అంతేకాకుండా ఈ మెగా ఈవెంట్‌లో ఆడిన ఎనిమిది జట్లకు గ్యారంటీ మనీ కింద 2 లక్షల 50 వేల డాలర్ల (రూ. 2 కోట్ల 22 లక్షలు) చొప్పున దక్కాయి. లీగ్‌ దశలో సాధించిన ఒక్కో విజయానికి ఆయా జట్లకు 34 వేల 314 డాలర్ల (రూ. 30 లక్షల 47 వేలు) చొప్పున లభించాయి.   

300 శాతం పెరిగిన ప్రైజ్‌మనీ
వన్డే ప్రపంచకప్‌ విజేతకు లభించే ప్రైజ్‌మనీ ఈసారి 300 శాతం పెరిగింది. ఐసీసీ అధ్యక్షుడు జై షా ఈ పెంపును అమల్లోకి తెచ్చారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.

Women's World Cup Final 2025: మహిళల వరల్డ్‌కప్‌-2025 విజేతగా భారత్‌

బీసీసీఐ భారీ నజరానా
వరల్డ్‌కప్‌ విజేత భారత్‌కు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. జగజ్జేత టీమిండియాకు రూ. 51 కోట్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు సైకియా తెలిపారు. ఈ బహుమతిని జట్టులోని ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ పంచుకుంటారని అన్నారు.

కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్‌ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలుపొంది, వన్డే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ​్‌లో భారత్‌ ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టి సౌతాఫ్రికాను చిత్తు చేసింది.

తొలుత బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారత్‌కు భారీ స్కోర్‌ (298/7) అందించగా.. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగిపోయింది. ఫలితంగా సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ లారా వోల్వర్డ్ట్‌ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. 

చదవండి: హ్యాట్సాఫ్‌ మజుందార్‌
 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)