Breaking News

IND vs PAK: ఆ మూడు మ్యాచ్‌లు గెలుస్తాం: పాక్‌ కెప్టెన్‌

Published on Tue, 02/03/2026 - 14:56

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్లో భారత్‌తో మ్యాచ్‌ బహిష్కరించడంపై పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ ఆఘా స్పందించాడు. తాము కేవలం కాంట్రాక్టు ఆటగాళ్లమని.. ప్రభుత్వం నిర్ణయానుసారమే నడుచుకుంటామని తెలిపాడు. 

వరల్డ్‌కప్‌ టోర్నీలో టీమిండియాతో మ్యాచ్‌ ఆడరాదని తమ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ఇందులో ఆటగాళ్లు చేసేదేమీ లేదని పేర్కొన్నాడు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశానికి కట్టుబడి ఉండాల్సిందేనని సల్మాన్‌ ఆఘా వ్యాఖ్యానించాడు.

ఆసీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి..
అదే విధంగా.. గ్రూప్‌ దశలో మ్యాచ్‌ రద్దు కారణంగా పాయింట్లు కోల్పోయే అంశం మీద కూడా సల్మాన్‌ ఆఘా స్పందించాడు. లీగ్‌ దశలో మిగిలిన మ్యాచ్‌లలో గెలిచి ముందడుగు వేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. 

కాగా ప్రపంచకప్‌ టోర్నీకి ముందు సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో పాకిస్తాన్‌ మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆసీస్‌ జట్టు దాదాపు ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగగా.. పాక్‌ ఈ మేర విజయం సాధించింది.

ప్రపంచకప్‌ అంటే భారత్‌తో మ్యాచ్‌ మాత్రమే కాదు
ఈ నేపథ్యంలో ఆసీస్‌తో మూడో టీ20లో విజయం తర్వాత సల్మాన్‌ ఆఘా (Salman Agha) భారత్‌తో మ్యాచ్‌ (IND vs PAK) రద్దు విషయం గురించి మాట్లాడాడు. ‘‘‘మేం బోర్డుతో కాంట్రాక్ట్‌ ఉన్న ఆటగాళ్లం. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేం కట్టుబడి ఉండాల్సిందే. ప్రపంచకప్‌ అంటే భారత్‌తో మ్యాచ్‌ మాత్రమే కాదు కదా!..

లీగ్‌ దశలో మరో మూడు మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ గెలిచి ముందంజ వేసేందుకు  ప్రయత్నిస్తాం’ అని సల్మాన్‌ పేర్కొన్నాడు. కాగా టీమిండియాతో ఆడరాదనే పాకిస్తాన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని పాక్‌ మాజీ క్రికెటర్లు షాహిత్‌ ఆఫ్రిది, యూసుఫ్, రషీద్‌ లతీఫ్, మొయిన్‌ ఖాన్, సర్ఫరాజ్‌ అహ్మద్‌ సమర్థించారు.

మిగిలిన మూడు జట్లు అవే
కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్‌- శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీ జరుగనున్న విషయం తెలిసిందే. ఇరవై జట్లు పాల్గొంటున్న ఈ ఈవెంట్లో భారత్‌, అమెరికా, నమీబియా, నెదర్లాండ్‌తో పాటు పాకిస్తాన్‌ గ్రూప్‌-‘ఎ’లో ఉంది. 

అయితే, భారత్‌లో తమకు భద్రత లేదంటూ బంగ్లాదేశ్‌.. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలంటూ ఓవరాక్షన్‌ చేయగా.. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) నిరాకరించింది. దీంతో బంగ్లాకు మద్దతుగా పాకిస్తాన్‌ కూడా ముందుగా టోర్నీ నుంచి వైదొలుగుతామని బీరాలు పలికింది. చివరగా భారత్‌తో మ్యాచ్‌ ఆడకూడదని నిర్ణయం తీసుకుంది. 

అపుడు అమెరికా చేతిలో ఓడి
అయితే, ఈ విషయంపై ఐసీసీకి ఇంతవరకు అధికారికంగా తెలియజేయకపోవడం పాక్‌ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్‌-2024లో పసికూన అమెరికా చేతిలో లీగ్‌ మ్యాచ్‌లో పాక్‌ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.

చదవండి: IPL 2026: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు గుడ్‌ న్యూస్‌!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)