Breaking News

గెలిచావు రమ్మన్నారు.. తర్వాత ఓడిపోయావన్నారు

Published on Sun, 11/08/2026 - 12:10

‘అమ్మా నువ్వే 42 ఓట్లతో గెలిచావు.. ధ్రువీకరణ పత్రంపై సంతకం చేద్దువు రా’ అని వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని అధికారులు పిలిచారు. అంతలోనే పచ్చ నేతలు అడ్డుపడటంతో టీడీపీ అభ్యర్థే గెలి­చారు, నువ్వు 6 ఓట్ల తేడాతో ఓడిపోయా­వు అని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సానివాడ ఎంపీటీసీ స్థానంలో జరిగిన అన్యాయమిది. కౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎచ్చెర్ల దివ్య శ్రీధర్‌కు ముందుగా 319 ఓట్ల మెజారిటీ లభించింది. దీంతో టీడీపీ రీకౌంటింగ్‌ కోరింది. 

రీకౌంటింగ్‌ తర్వాత దివ్య­కు 42 ఓట్లు మెజార్టీ వచ్చినట్లు అధికారులు ప్రకటించారు. ధ్రువపత్రంపై సంతకం చేయాలని పిలిచారు. అయితే ఈ ప్రాదేశికంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఊరు ఉండటంతో ఎలాగైనా గెలవాలని టీడీపీ అభ్యర్థి అరసవల్లి లక్ష్మీదేవి రీకౌంటింగ్‌ పెట్టించారు. దీనికి ఎన్నికల అధికారులు, ఆర్‌ఓ బొడ్డేపల్లి శైలజ సహకారం తోడవ్వడంతో అంకెలను మార్చేసి, ఆరు ఓట్ల తేడాతో దివ్య ఓడిపోయారని, లక్ష్మీదేవి గెలిచారని ఆర్‌ఓ శైలజ ప్రకటించేశారు. దీంతో దివ్య, ఆమె అనుచరులు నిశ్చేషు్టలయ్యారు. రీకౌంటింగ్‌ పెట్టాలని దివ్య కోరినప్పటికీ ఆర్‌ఓ నిరాకరించారు.

అన్యాయం చేశారు..
ఎమ్మెల్యే గొండు శంకర్‌ బెదిరింపులతో తన భర్త శ్రీధర్‌ను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారని, ఇక్కడ ఎన్నికల అధికారుల సాయంతో తనకు అన్యాయం చేశారని దివ్య కన్నీటి పర్యంతమయ్యారు. తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టర్‌కు ఫోన్‌ చేసినా స్పందించలేదన్నారు. అక్కడే ఉన్న ఆర్డీఓ సాయి శిరీష, జెడ్పీ సీఈఓ వెంకట్‌రామన్‌లు వారికేం సంబంధం లేదని చెబుతున్నారన్నారు.  

 – అరసవల్లి    (శ్రీకాకుళం )             

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)