Breaking News

లోకేష్‌ బెదిరింపులకు ఎవరూ భయపడరు: సతీష్‌కుమార్‌రెడ్డి

Published on Sat, 05/31/2025 - 19:20

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: వైఎస్సార్.. కడప జిల్లాకు సేవచేసి అభివృద్ధి పథంలో నడిపించారు.. అటువంటి మహనీయుడు విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టడం సమంజసమా..? అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సతీష్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సున్నితంగా ఇది తప్పు అని పోలీసులకు అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. దీంతో అక్కడి ప్రజలు ఆ జెండాలను పక్కన పెట్టారు. ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉంది’’ అంటూ సతీష్‌కుమార్‌ రెడ్డి మండిపడ్డారు.

‘‘అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులపై కేసులు పెట్టి ఇష్టారీతిన కొట్టారు. ఆ పోలీసులకు టీడీపీ నాయకులు జీతాలు ఇస్తున్నారా...?. మేము అతన్ని పోలీసుగా కాకుండా రౌడీగా పరిగణిస్తాం. మీ పరిధి దాటి మీరు రౌడీగా ప్రవర్తిస్తే మేము సహించాలా..?. తప్పు చేసిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. మొన్న యువకులను నడిరోడ్డుపై ఇష్టారీతిన కొట్టారు. కొందరు అధికారులు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే సహించేది లేదు. రేపు వైఎస్సార్‌సీపీ గెలిచాక ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది..?. మహానాడులో వైఎస్సార్‌సీపీ వాళ్లకు తడిసిపోతుంది అంటున్నారు. మాకు కాదు తడిసిపోయేది.. మీ కార్యకర్తలకు తడిసిపోతుంది. 

..ఇది తప్పు అని చెప్పాల్సిన చంద్రబాబు కూడా వైఎస్సార్‌సీపీ వారికి ఏ పథకం ఇవ్వొద్దు అంటున్నాడు. మీరు తెస్తున్న ఈ సంస్కృతి రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది..?. గతంలో నేను టీడీపీలో ఉండి మీటింగు పెడితే ఒక కల్యాణ మండపం కూడా నిండలేదు. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి వస్తారు. అది బలుపు కాదు వాపు.. నువ్వు కడపలో పెట్టీ మాట్లాడాలంటే నువ్వు రద్దు చేసిన మెడికల్ సీట్ల గురించి చెప్పాలి. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసి ప్రజల నెత్తిన భారం వేస్తున్నావు

..ఏంటి తడిసిపోయేది లోకేష్.. ఏమి చేయగలవ్.. అరెస్ట్ చేయించి కొట్టిస్తావు అంతేగా.. ఆ తర్వాత నీ పరిస్థితి ఎంతో ఆలోచించుకో.. నీ కార్యకర్తల పరిస్థితి ఏంటో గుర్తు చేసుకో. మీరు, ఎమ్మెల్యేలు చేస్తున్న దోపిడీ నుంచి మీరు తప్పించుకునే అవకాశమే లేదు. మీరు భయపడితే ఇక్కడ ఎవరు భయపడరు. ఈ ఏడాది కాలంలో నువ్వు చేసింది పింఛన్ పెంపు మాత్రమే.  అదీ ఇప్పటి వరకు ఒక్క కొత్త పింఛను ఇవ్వలేదు. గ్యాస్ లబ్ది ఏ ఊరికి వెళ్ళైనా అడుగుదాం... సగానికి పైగా అందలేదు. నువ్వు ఎంతమందిని జైల్లో వేయగలవు లోకేష్..?

..లక్ష కోట్లు ఒక్క రాజధానికి పెట్టడం సమంజసమా..?. నువ్వు తీసుకునే లక్ష కోట్లా అప్పు.. అమరావతి వాళ్లే కడతారా..?. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అందరూ ఆ అప్పు కట్టాలి. ఎన్టీఆర్ కంటే మహానాడులో జగన్ నామ స్మరణ మాత్రమే చేశారు. జగన్ బయటకు వెళితే జనం రాకతో రోడ్లు పట్టడం లేదు.. అదే జగన్ అంటే.. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో.. మేము కూడా జైలు బరో చేస్తాం. నీకు, నీ కొడుకుకి వినాశ కాలే విపరీత బుద్ధి అన్నట్లుంది’’ అని  సతీష్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)