Breaking News

‘మంగళగిరిలో లోకేష్‌ను మడత పెట్టేస్తాం’

Published on Wed, 01/31/2024 - 20:11

గుంటూరు: మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సీటులో నారా లోకేష్ పోటీ చేయటం దారుణమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మండిపడ్డారు. జోగి రమేష్‌ బుధవారం మంగళగిరి వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ లోకేష్‌ను మడత పెట్టేస్తుందని అ‍న్నారు. వైఎస్సాఆర్‌సీపీ దెబ్బకు లోకేష్ పారిపోతాడని అ‍న్నారు. మంగళగిరి అని పలకటమే చేతకాని లోకేష్ మంగళగిరిలో పోటీ చేయటమా? అని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయి రకరకాల వేషాలలో దొంగలు వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలునిచ్చారు.

సీఎం జగన్‌కు అండగా ఉండాలి..
అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకురావాలని ఎంతోమంది మేధావులు ఆలోచన చేశారని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే మేధావుల ఆలోచనలనకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకొచ్చారు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అని.. ఆయనకు అందరూ అండగా ఉండాలని అన్నారు.

బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు పేదలకు దేవుడని వైఎస్సార్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త  గంజి చిరంజీవి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే సామాజిక న్యాయం అమలవుతుందని తెలిపారు. మంగళగిరిలో బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ చేస్తున్నాడని మండిపడ్డారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ అగ్రవర్ణాల సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కనపెట్టి మంగళగిరి సీటును బీసీలు కేటాయించారని అన్నారు.

వైఎ‍స్సార్‌సీపీ మరోసారి గెలిపించుకోకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతారని ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. దొంగల ముఠా.. పచ్చ మీడియా చెప్పే విషయాలను రాసే కథనాలను ప్రజలు నమ్మవద్దని తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)