Breaking News

బాబు భవిష్యత్తుపై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు

Published on Sat, 05/31/2025 - 12:14

సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో వ్యవస్థలు కూటమి పాలనలో దారుణంగా విఫలమయ్యాయని, ఆధారాల్లేకుండానే మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డిని జైలుకు పంపించారని వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అన్నారు. శనివారం నెల్లూరు జైల్లో కాకాణితో ములాఖత్‌ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘‘వైఎస్సార్‌సీపీ నేతలపై వరుసపెట్టి తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. కల్పిత కథనాలు సృష్టించి.. ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణి మీద కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇది పరాకాష్టకి చేరింది. అక్రమంగా అరెస్ట్ చేస్తే.. బయటకు వచ్చాక వాళ్లు మరింత రాటు తేలుతారు. 

వైఎస్సార్‌సీపీలో ఉండే సీనియర్‌ నేతలను టార్గెట్‌ చేశారని మేం ముందే అనుకున్నాం. అయితే ఎంత అణగతొక్కాలని చూస్తే అంతే బలంగా వైఎస్సార్సీపీ పైకి లేస్తుంది. చంద్రబాబు(Chandrababu) దీనిని మొదలుపెట్టారు. కానీ, దీని పరిణామాలు భవిష్యత్తులో ఘోరంగా ఉండబోతున్నాయి. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాం. దేనికైనా సిద్ధం.

రాష్ట్రంలో సిస్టమ్‌ ఫెయిల్‌ అయ్యింది. పబ్లిక్‌గానే బట్టల్లేకుండా డ్యాన్సులు వేయిస్తున్నారు. ఖాకీ డ్రెస్సు వేసుకున్న పోలీసులు.. తెనాలిలో ముగ్గురిని నడిరోడ్డుపై దారుణంగా కొట్టారు అని అన్నారాయన. 

గతంలో చంద్రబాబును పక్కా ఆధారాలతో మా ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. ఆయనపై అనేక కేసులు ఉన్నాయి.  లిక్కర్‌ కేసులో బెయిల్‌ మీద ఉన్న చంద్రబాబు.. మేనేజ్‌ చేసుకుంటూ వస్తున్నారు. వైఎస్‌ జగన్‌(YS Jagan) అనుకుని ఉంటే చంద్రబాబును మరోసారి జైలుకు పంపేవారు. చంద్రబాబుకి రాజకీయ ఉనికి లేకుండా చేయాలని రాష్ట్ర ప్రజలు సిద్దమయ్యారు. కూటమికి పాడె కట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబులో మార్పు వస్తే మేలు. రాకపోతే భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది’’ అని హెచ్చరించారాయన. 

ఇదీ చదవండి: కూటమివారి నవమోసాలు

Videos

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు