దేవుడిపై భక్తి ఉన్నవారు ఇలా చేస్తారా? బాబుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

Published on Thu, 03/05/2026 - 05:02

సాక్షి, అమరావతి: కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవారి దేవస్థానం నిర్వహణ అత్యంత పవిత్రమైన బాధ్యతని.. సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలిసి కూడా ఆరోపణలున్న వ్యక్తినే టీటీడీ చైర్మన్‌గా నియమించి ఆలయ ప్రతిష్ట, పవిత్రతను చంద్రబాబు కాలరాశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలోనే టీటీడీ ల్యాబ్‌ నాణ్యత లేదంటూ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు తిరిగి టీటీడీకి రావడం.. రిజెక్ట్‌ చేసిన వాటిని అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ సిట్‌ ఛార్జిషీట్‌లో స్పష్టం చేయడం ఆందోళనకరమన్నారు. 

తిరుమల లడ్డూ ప్రసాదంపై రాజకీయ దుమారం రేపుతూ.. నెయ్యి ధరల విషయంలో తప్పుడు ప్రచారం చేసి లాభాలు ఆర్జించడం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందన్నారు. దేవుడిపై భక్తి ఉన్న వారు ఎవరైనా ఇలా చేస్తారా? అని సీఎం చంద్రబాబు నిలదీశారు. ఆలయాల పవిత్రత, భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రభుత్వాల తొలి బాధ్యత అని గుర్తు చేశారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. టీటీడీ నిర్వహణలో చంద్రబాబు సర్కార్‌ తీరును సాక్ష్యాధారాలతో ఎండగడుతూ తన ‘ఎక్స్‌’ ఖాతాలో వైఎస్‌ జగన్‌ బుధవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..

దేవుడిపై బాబుకు భక్తి, శ్రద్ధ, భయం లేదని మరోసారి రుజువైంది..
దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన బాధ్యత. అది అత్యంత నిష్టతో చేయాల్సిన బాధ్యత. అలాంటి టీటీడీ చైర్మన్‌ పదవిలో నిష్కళంక వ్యక్తిత్వం, అచంచల భక్తి, నిబద్ధత, నిష్ట కలిగిన వారే ఉండాలి. కానీ చంద్రబాబు ఈ పవిత్రమైన స్థానాన్ని స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరించారు. 

ఒక బాధిత మహిళ చంద్రబాబు గారికి లేఖ రాస్తూ.. ప్రస్తుత టీటీడీ చైర్మన్‌ తనను మోసం చేశాడని, తన జీవితంతో ఆడుకున్నాడని, ఏ చిన్న పని కోసం ఆడవారు వచ్చినా వారిని ఇబ్బంది పెడతారంటూ ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బాధ్యత ఉన్న వ్యక్తిగా చంద్రబాబు గారు ఈ ఫిర్యాదుపై విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సింది పోయి, ఇన్ని రకాల ఆరోపణలు ఉన్నాయని తెలిసి కూడా, విచారణ, చర్యలన్నవి పూర్తిగా పక్కనపెట్టి, అతన్నే టీటీడీ చైర్మన్‌గా నియమించి, ఆలయ ప్రతిష్ట, పవిత్రతను కాలరాశారు. దేవుడి పట్ల భక్తి ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? ఆలయ పవిత్రతను కాపాడాలన్న ఉద్దేశం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా? చంద్రబాబుకు భక్తీ లేదు.. శ్రద్ధ అంతకన్నా లేదు. దేవుడిపట్ల భయం కూడా లేదని మరోసారి రుజువైంది.

టీటీడీకి నెయ్యి సరఫరాను సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు..
ఈ రకంగా చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో తప్పు చేసి, దాన్ని వేరొకరిమీదకు నెట్టి, మళ్లీ దానిమీద రాజకీయ దుమారం రేపుతూ, ఆ నెయ్యితోనే స్కాంలు చేస్తున్నారు. మరోవైపు 2014–19 మధ్య టీటీడీ నెయ్యి కొనుగోలు ధర దాదాపుగా రూ.278– రూ.330 ఉంది. 2019–24 మధ్య కూడా నెయ్యి సగటు రేటు దాదాపుగా అంతే ఉంది. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉంటూ, నెయ్యి విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, దానిపై రాజకీయ దుమారం రేపుతూ.. తన హెరిటేజ్‌కి చెందిన మాన్యుఫ్యాక్చరింగ్‌ కంపెనీ ఇందా­పూర్‌ డెయిరీకి కిలో నెయ్యి రూ.658లకు 2025లో అమ్ముకునేందుకు కట్టబెట్టి, లాభాలు ఆర్జిస్తూ, స్కాంలు చేస్తూ టీటీడీకి నెయ్యి సరఫరాను తన సొంత ఆదాయ మార్గంగా మార్చుకున్నారు. ఆలయాల నిర్వహణలో చంద్రబాబుకు భక్తి లేదు.. శ్రద్ధ లేదు.. నిష్ట లేదు.. నిజాయితీ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ.

నాణ్యత లేని నెయ్యిని అనుమతించింది.. లడ్డూ తయారీలో వాడింది బాబు హయాంలోనే..
లడ్డూలో వాడే నెయ్యి విషయంలోనూ చంద్ర­బాబుది అదే నిర్లక్ష్యం. నెయ్యి క్వాలిటీ(నాణ్యత) బాగోలేదని ఈ చంద్రబాబు గారి హయాంలోనే  టీటీడీ ల్యాబ్‌ తిప్పి పంపినా.. మళ్లీ అవే క్వాలిటీ లేని నెయ్యి ట్యాంకర్లు ఆయన హయాంలోనే వేరే వారి పేరిట తిరిగి టీటీడీకి రావడం.. ఆయన హయాంలో వచ్చిన అవే ట్యాంకర్లను టీటీడీ అంగీకరించి, అనుమతించడం.. తిరుమల లడ్డూ తయారీలో వాడడం.. ఇదే విషయాన్ని సీబీఐ–­సిట్‌ మొదటి ఛార్జిషీటు 64, 91 పేజీల్లోనూ, ఫైనల్‌ ఛార్జిషీటు 44వ పేజీలోనూ చాలా స్పష్టంగా చెప్పింది. చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తీ లేదు.. ఆలయాల నిర్వహణపట్ల శ్రద్ధ అంతకన్నా లేదనడానికి ఇది మరొక ఉదాహరణ. 

Videos

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)