Breaking News

జైలులో నన్ను టెర్రరిస్టులా ట్రీట్‌ చేశారు: మిథున్‌ రెడ్డి

Published on Wed, 10/01/2025 - 11:07

సాక్షి, తిరుపతి: టీడీపీ ప్రభుత్వంలో అక్రమ కేసులతో తాను భయపడే ప్రసక్తే లేదన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి(MP Mithun Reddy). కష్ట కాలంలో తనకు అండగా నిలిచిన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌కు(YS Jagan) ధన్యవాదాలు తెలిపారు. జైలులో తనను టెర్రరిస్టు మాదిరిగా ట్రీట్‌ చేశారు అంటూ సంచలన విషయాలను వెల్లడించారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి తాజాగా తిరుపతిలో(Tirupati) మీడియాతో మాట్లాడుతూ..‘అక్రమ కేసులతో నేను అధైర్యపడను. టీడీపీ ప్రభుత్వం నాపై తప్పుడు కేసులు పెట్టింది. వేధించడానికే నాపై కేసులు పెట్టారు. ఇలా అక్రమ కేసులు పెట్టి సాధించింది ఏంటి?.. పైశాచిక ఆనందం తప్ప మరేమీ లేదు. నన్ను అరెస్ట్ చేసి నా తల్లిదండ్రులను మానసిన వేదనకు గురి చేశారు. 73 రోజులు.. దాదాపు రెండు నెలలు జైల్లో పెట్టారు. గౌరవ కోర్టు నాకు బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ ఆర్డర్‌లో కోర్టు చెప్పినవన్నీ నిజాలే. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. చివరిగా ఒకటే చెబుతున్నా.. నేను ఎక్కడా వెనక్కి తగ్గేది లేదు. ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టీ డైవర్షన్ చేస్తున్నారు. నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ  ధన్యవాదాలు.

ఎప్పుడు తెలుగుదేశం(TDP) పార్టీ అధికారం ఉన్నా.. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌లు చేస్తున్నారు. 2014-2019 మధ్య కూడా నాపై తప్పుడు కేసులు పెట్టారు. టీడీపీ అధికారంలో ఉన్న ప్రతీసారి.. ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. రకరకాల అక్రమ కేసులు పెట్టి.. డైవర్షన్‌ రాజకీయాలు చేస్తున్నారు. నన్ను జైలులో దారుణంగా చూశారు. ఏదో టెర్రరిస్టు మాదిరిగా ట్రీట్‌ చేశారు. ఎవరితో నన్ను మాట్లాడనివ్వలేదు. సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. విజయవాడ నుంచి మానిటరింగ్ చేశారు, అధికారులు కూడా భయపడే పరిస్థితి ఉండేది. నాతో ఒక్క అధికారి కూడా మాట్లాడలేదు. కోర్టు ఆదేశాలు ఇచ్చేవరకు జైలు అధికారులు వసతులు కల్పించలేదు. నన్ను కలిసే వారిపై కూడా నిఘా పెట్టారు. వ్యక్తికి ఉండాల్సిన ప్రాథమిక హక్కులను కూడా ఉల్లంఘించారు’ అని చెప్పుకొచ్చారు. 

ఇది కూడా చదవండి: మహిళలకు బాబు మోసం

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)