Breaking News

వీ వాంట్‌ జస్టిస్‌.. సేవ్‌ డెమోక్రసీ: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల నిరసన

Published on Thu, 11/14/2024 - 10:37

అమరావతి, సాక్షి: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మూడో రోజు ప్రారంభమైన కాసేపటికే.. శాసనమండలిలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తింది. సోషల్‌ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై చర్చకు వైఎస్సార్‌సీపీ పట్టుబట్టగా.. చైర్మన్‌ అందుకు నిరాకరించారు. దీంతో.. ఎమ్మెల్సీలు చైర్మన్‌ పోడియం చుట్టుముట్టి అరగంట పాటు నినాదాలతో తమ నిరసన తెలియజేశారు. 

సోషల్ మీడియా అరెస్టులతో పాటు డీఎస్సీపై పీడీఎఫ్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు ఆ రెండు తీర్మానాలను తిరస్కరించారు. తమ వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని చైర్మన్‌ను మండలిలో ప్రతిపక్ష నేత బొత్స  కోరారు. అయినా అందుకు చైర్మన్‌ అంగీకరించలేదు. దీంతో.. 

పోడియం వద్దకు వచ్చి చేరిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ‘‘వీ వాంట్ జస్టిస్..’’, ‘‘సేవ్‌ డెమోక్రసీ’.. అంటూ నినాదాలు చేస్తుండగా.. మరోవైపు కూటమి ఎమ్మెల్సీలు వాళ్లతో వాగ్వాదానికి దిగి రెచ్చగొట్టేందుకు యత్నించారు. కానీ, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మాత్రం సోషల్ మీడియా పోస్టుల ప్రతులను చైర్మన్‌కు చూపిస్తూ నినాదాలు కొనసాగించారు. చేసేది లేక ఆ నినాదాల నడుమే ఏపీ మంత్రులు మాట్లాడేందుకు యత్నించారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొనగా.. మండలిని కాసేపు వాయిదా వేశారు చైర్మన్‌. 

ఇదీ చదవండి: చావు లెక్కలు నవ్వుతూ.. 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)