Breaking News

‘పాల‌నా వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకే అక్ర‌మ అరెస్ట్‌లు’

Published on Sat, 05/17/2025 - 14:19

సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబుకి పాల‌న చేత‌కాక, హామీలు అమ‌ల్లో త‌న వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు రాజ‌కీయ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. విశాఖలో మీడియాకు విడుదల చేసిన వీడియోలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నియంత పాల‌న సాగుతోందని ధ్వజమెత్తారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా  గ‌త ప్ర‌భుత్వంలో ప‌నిచేసిన ఐఏఎస్ అధికారులు ధ‌నుంజ‌య‌రెడ్డి, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డిల‌ అక్ర‌మ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

హామీల అమ‌లు విష‌యంలో అన్నివ‌ర్గాల ప్ర‌జ‌ల నుంచి ప్ర‌భుత్వంపై వ‌చ్చిన వ్య‌తిరేక‌త‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు, ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించేందుకే ఇలాంటి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయ‌కులు వైఎస్‌ జ‌గ‌న్‌ను ఇబ్బంది పెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా అవినీతికి ఆస్కారం లేక‌పోయినా మ‌ద్యం స్కామ్ జ‌రిగిన‌ట్టు త‌ప్పుడు వాంగ్మూలాలు సృష్టించి ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉన్న వారిని అరెస్టు చేస్తున్నారని అన్నారు.

వైఎస్సార్సీపీ హ‌యాంలో బెల్ట్ షాపులు పూర్తిగా ర‌ద్దు చేసి, మ‌ద్యం షాపులు త‌గ్గించి, అమ్మ‌కాలు త‌గ్గిస్తే స్కాం జ‌రిగింద‌ని చెప్ప‌డ‌ం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని డిస్టిల‌రీల‌కు చంద్రబాబే అనుమ‌తులిచ్చాడని, గ‌త వైఎస్సార్సీపీ పాల‌న‌లో ఒక్క డిస్టిల‌రీకి కూడా అనుమ‌తివ్వ‌లేదని స్పష్టం చేశారు. గ‌త మా వైఎస్సార్సీపీ పాల‌న‌లో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్ర‌భుత్వ‌మే నిర్వ‌హిస్తే, కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక ప్రైవేటు వ్య‌క్తుల చేతుల్లో పెట్టిందని గుర్తు చేశారు.

రాష్ట్రంలో మ‌ద్యం ఏరులై పారుతోంది. వీధివీధినా బెల్ట్ షాపులు తెరిచి 24 గంట‌లూ ఇష్టారాజ్యంగా మ‌ద్యం అమ్మ‌కాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్ర‌బాబుకి ద‌మ్ముంటే త‌న మీద న‌మోదైన ఇన్న‌ర్ రింగ్‌రోడ్డు స్కాం, లిక్క‌ర్ కుంభ‌కోణం, ఏపీ ఫైబ‌ర్‌నెట్ స్కాం, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కుంభ‌కోణాల‌పై విచార‌ణకు సిద్దం కావాలని డిమాండ్ చేశారు.

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఏడాదిలోనే రాష్ట్రం తిరోగ‌మ‌నంలో ప‌య‌నిస్తోందని, ఐఏఎస్‌, ఐపీఎస్‌ల‌నే కాకుండా పారిశ్రామిక‌వేత్త‌ల‌ను కూడా బెదిరిస్తున్నారని అన్నారు. కూట‌మి ప్ర‌భుత్వ వేధింపులతో రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదని, అరాచ‌క పాల‌న‌తో ఎంతోకాలం ప్ర‌జాచైత‌న్యాన్ని అడ్డుకోలేరని అన్నారు. రాబోయే రోజుల్లో వైయ‌స్సార్సీపీ నేతృత్వంలో ప్ర‌జా ఉద్య‌మాలతో కూట‌మి ప్ర‌భుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

Varudu Kalyan: లిక్కర్ స్కాం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వమే

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)