Breaking News

కూటమి పాలనలో డ్రగ్స్‌ డెన్‌గా ఏపీ: వంగవీటి నరేంద్ర

Published on Mon, 12/22/2025 - 15:03

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్‌ డెన్‌గా కూటమి సర్కార్‌ మార్చేసిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విచ్చలవిడిగా పేకాట క్లబ్‌లను కూడా నిర్వహిస్తున్నారంటూ దుయ్యబట్టారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం వచ్చి పేకాట ఆడుతున్నారని.. టీడీపీ నేతల కనుసన్నల్లోనే డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. 

‘‘హోం మంత్రి.. పోలీసులను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అక్రమ అరెస్టులకే ఉపయోగిస్తున్నారు. డ్రగ్స్ అరికట్టాం అంటున్న చంద్రబాబు, అనిత ఇప్పుడు దొరుకుతున్న డ్రగ్ర్‌కి ఏం సమాధానం చెప్తారు?. ఢిల్లీ నండి డ్రగ్స్ ఏపీకి వస్తుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నట్టు?. జగన్ హయాంలో డ్రగ్స్, గంజయిని అరికట్టడానికి సెబ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ఏం చేస్తుందో ఏమీ అర్థం కావటం లేదు’’ అని నరేంద్ర నిలదీశారు.

‘‘ఈ విచ్చలవిడి డ్రగ్ర్‌ని నిలిపేయకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. విద్యా సంస్థల దగ్గర్‌లో యథేచ్ఛగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ వాడటం మొదలుపెడితే యువత తీవ్రంగా నాశనం అవుతుంది. ప్రభుత్వ అండదండలతోనే డ్రగ్స్ రాష్ట్రంలోకి వస్తోంది. మ్యాంగో బే కల్చరల్ రిక్రియేషన్ క్లబ్ వెనుక టీడీపీ నేతలు ఉన్నారు. వారెవరో బయట పెట్టాలి. రాష్ట్రాన్ని దౌర్భాగ్యకర పరిస్థితిలోకి తీసుకెళ్లారు’’ అంటూ వంగవీటి నరేంద్ర ధ్వజమెత్తారు.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)