‘డీఎస్సీలో అక్రమాలు నిజం.. అందుకే డైవర్షన్ పాలిటిక్స్‌’

Published on Thu, 07/30/2026 - 11:15

సాక్షి, నెల్లూరు జిల్లా: ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవలో అన్నీ కోతలే.. ఉద్యోగులు కూడా ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. రైతుల మీద కేసులు బనాయించిన ఏకైక ప్రభుత్వం టీడీపీ’’ అంటూ ఆయన దుయ్యబట్టారు.

‘‘విద్యా వ్యవస్థను భష్టు పట్టించేందుకే లోకేష్‌కి ఆ శాఖ ఇచ్చారు. సీబీఐ విచారణ జరిపిస్తే మీకు వచ్చే నష్టం ఏంటి..? అక్రమాలు జరిగాయి కాబట్టే.. దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. లోకేష్‌తో చర్చించేందుకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని పంపిస్తాం.. లోకేష్ రాగలడా..?. మేము అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం చెప్పాలి. అబద్ధానికి చొక్కా, ప్యాంట్ వేస్తే అది చంద్రబాబే. ఎమ్మెల్యే సోమిరెడ్డి జీవితం గురించి ఒక పుస్తకం రాయొచ్చు’’ అంటూ కాకాణి ఎద్దేవా చేశారు. 

‘‘టీడీపీ నేతల విమర్శలకు భయపడే రోజులు పోయాయి.  ధర్మేంద్ర ప్రధాన్‌కి నైతిక విలువ ఉన్నాయి కాబట్టే రాజీనామా చేశారు. నారా కుటుంబానికి నైతిక విలువలు ఉండవని లోకేశ్ నిరూపించారు. కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చి.. రిలే నిరహార దీక్షలకు సిద్ధమవుతున్నాం’’ అని కాకాణి పేర్కొన్నారు.

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)