Breaking News

ఇక మరింత దూకుడుగా వైఎస్సార్‌సీపీ పోరుబాట

Published on Sat, 12/14/2024 - 10:28

గుంటూరు, సాక్షి: అన్నదాతకు అండగా కార్యక్రమం సూపర్‌ సక్సెస్‌కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఫుల్‌ జోష్‌లో ఉన్నాయి. ఈ ఊపులోనే.. పరిపాలన పట్టించుకోని కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా మరిన్ని పోరాటాలను చేయాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇస్తున్నారు.

కూటమి అధికారంలోకి వచ్చాక.. ‘‘వాళ్లు ప్రస్తుతం హానీమూన్‌లో మునిగి తేలుతున్నారని, అది ముగిసేదాకా అయ్యేదాకా వేచిచూద్దామని.. ఆ తర్వాత వాళ్ల సంగతి తేలుద్దామని’’ వైఎస్‌ జగన్‌, వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. ఆయన చెప్పినట్లుగానే ఆర్నెల్ల టైం ముగిసింది. ఎన్నికల టైంలో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీల్లో ఓ ఒక్కటీని పరిపూర్ణంగా అమలు చేయలేకపోయింది కూటమి ప్రభుత్వం. పైగా..

పైగా అన్నివర్గాలను బాబు ప్రభుత్వం మోసం చేస్తూ వస్తోంది. ఈ మోసం తారాస్థాయికి చేరడం, పరిపాలన గాడి తప్పడంతో ఇక ఉపేక్షించకూడదని వైఎస్‌ జగన్‌ నిర్ణయించుకున్నారు.  తొలి విడతగా రైతులు, కరెంట్‌ ఛార్జీలు, స్కూల్‌ ఫీజుల బకాయిలు లాంటి ప్రధాన సమస్యలపై పోరాడేందుకు పిలుపు ఇచ్చారు.

ఇదీ చదవండి: బాబు దగా పాలన.. తొలిపోరు విజయవంతం

కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు పోరుబాట పేరిట వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజలు, రైతుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. రాష్ట్రంలో రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ...కలెక్టర్లకు  డిమాండ్‌ పత్రాలను అందజేశారు. చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని వైఎస్సార్‌సీపీ నాయకులపైన, రైతులపైన హౌస్‌ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం. 

ఈ క్రమంలో.. ప్రజల తరఫున కూటమి సర్కార్‌పై మరిన్ని పోరాటాలు చేయాలని.. ప్రజా సమస్యల పరిష్కారమే ఈ పోరాటాల ఎజెండాగా ఉండాలని పార్టీ నేతలకు వైఎస్‌ జగన్‌ సూచించారు. దీంతో.. ఇక నుంచి పోరుబాటలో వైఎస్సార్‌సీపీ మరింత దూకుడుగా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.

  • పెంచిన కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నాలకు వైఎస్సార్‌సీపీ పిలుపు
  • ఈ నెల 27న కరెంట్‌ ఛార్జీలు తగ్గించాలంటూ నిరసన కార్యక్రమాలు
  • ప్రజలపై రూ.15,500 కోట్ల కరెంట్‌ భారం వేసిన చంద్రబాబు ప్రభుత్వం
  • ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదలకు మరో పోరాటం
  • జనవరి 3న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో  రాష్ట్రవ్యాప్త ధర్నాలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)