‘బాబూ.. రైతుల జీవితాలతో ఆటలా?’

Published on Sat, 12/27/2025 - 13:19

సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వ తీరుపై వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఇంచార్జ్‌ దొంతిరెడ్డి వేమారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో రైతులను బతకనివ్వరా? అని ప్రశ్నించారు. రైతుల కోసం కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయలేరా?. రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు? అని మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ నాయకులు దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ..‘రాజధానిలో రైతు రామారావు మృతి అత్యంత విచారకరం. రాజధానిలో ఇలాంటి రామారావులు ఇంకా ఎంతమంది బలి కావాలి?. ఇప్పటికే 30వేల మంది రైతుల నుండి భూమి తీసుకున్నారు. ఇంకా భూములు, ఇళ్లు తీసుకుంటామంటున్నారు. రాజధాని ప్రాంతంలో రైతులను బతకనివ్వరా?. భూమిని లాగేసుకుంటే రైతు ఎంత ఆవేదన చెందుతాడో అర్థం చేసుకోలేరా?. రైతు రామారావు నుండి భూమి, ఇంటితోపాటు చివరికి ఆయన ప్రాణం కూడా తీసుకున్నారు. రూ.2.77 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు రాజధానిలో ఏం అభివృద్ధి చేశారు?.

ఏ రైతుల సమస్యలు పరిష్కారం చేశారు?. రైతుల కోసం కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేయలేరా?. రైతు కుటుంబం నుండి వచ్చిన చంద్రబాబుకు రైతుల బాధలు అర్థం కావా?. భూ సమీకరణ సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ, ఏ ఒక్క హామీని కూడా ఎందుకు అమలు చేయలేదు?. రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారు?. మొదట భూములు ఇచ్చిన వారికే ఏమీ చేయలేని చంద్రబాబు.. మళ్ళీ భూసేకరణ చేస్తామని ఎలా అంటారు?. చంద్రబాబు తన పద్దతి మార్చుకోవాలి.

ఇంకా ఎంతమంది రైతులు చనిపోవాలి?. చంద్రబాబు రాజధాని రైతుల జీవితాలను అగమ్యగోచరం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయమనే రైతులు కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వస్తున్నారే గానీ ఏ‌ఒక్క సమస్య కూడా పరిష్కారం కావటం లేదు. ఇంకా ఎంత కాలం అబద్దాలు, మాయ మాటలతో కాలం వెళ్లదీస్తారు?. రైతు రామారావు చివరి మాటలకైనా విలువ ఇవ్వండి. రైతుల సమస్యలు పరిష్కరించండి’ అని హితవు పలికారు. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)