Breaking News

‘దేవుడితో రాజకీయాలు వాళ్లకు బాగా అలవాటే!’

Published on Mon, 11/10/2025 - 14:13

సాక్షి, గుంటూరు: దేవుడితో రాజకీయాలు చేయడం చంద్రబాబు అండ్‌ కోకు చాలా సర్వసాధారణమైన విషయమని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. తిరుమల అన్నప్రసాదంపై తాను చేసిన కామెంట్లను ఎల్లో మీడియా ప్రచురించడంపై ఆయన తాజాగా స్పందించారు. 

గుంటూరు జిల్లా కోర్టు వద్ద కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజ్ లను ప్రైవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ లీగల్ సెల్  ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తిరుమలలో 1985 నుంచి ఉచిత భోజనం పెడుతున్నారు. ఉచిత భోజనం కోసం భక్తులు రూ. 27 వేల కోట్లు చందాలు ఇచ్చారు. కొండపైన దాదాపు 40 సంవత్సరాలు నుంచి భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదం అందిస్తున్నారు. నేను ఇప్పుడు వెళ్లి భోజనం చేశాను కాబట్టి భోజనం బాగుందని చెప్పాను. కానీ ఎల్లో మీడియా బీఆర్‌ నాయుడు ఏదో గొప్పగా పని చేశాడని వాళ్ళ ఛానల్ లో వేసుకుంటున్నారు.

బీఆర్‌ నాయుడు ఏమన్నా భక్తుడా...?
టీవీ5 బీఆర్‌ నాయుడు ఓ బ్రోకర్. దేవుడితో రాజకీయాలు చేయటం వాళ్లకు బాగా అలవాటు. అందుకే చంద్రబాబు నాయుడు లడ్డు ప్రసాదంతో రాజకీయం చేశాడు. ఇప్పుడు నా వ్యాఖ్యలతో బీఆర్‌ నాయుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు దేవుడితో రాజకీయాలు చేస్తాడు కాబట్టి ఒకసారి అలిపిరిలో ల్యాండ్ మైన్ పేలింది అని అంబటి అన్నారు.

.. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించడంతో పాటు పేద విద్యార్థులు డాక్టర్లు కావాలని భావించారు. కానీ చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీ లతో వ్యాపారం చేయాలని భావిస్తున్నారు. మెడికల్ కాలేజీలు అమ్మేసి లోకేష్ జేబులు నింపాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారు అని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. 

Ambati: దేవుడితో రాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటే

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)