లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్
Breaking News
కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైఎస్ జగన్ ఫైర్
Published on Tue, 06/17/2025 - 18:13
సాక్షి,తాడేపల్లి : చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మహిళపై పచ్చ సైకోల అరాచకంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? అంటూ ప్రశ్నించారు.
కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇది నిదర్శనం అంటూ ధ్వజమెత్తారు.. ‘మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా?. సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే.
తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడు. ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు. చంద్రబాబు.., మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి. పొలిటికల్ గవర్నెన్స్, రెడ్‌బుక్ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు. ఈ ఘటనతోపాటు, ఏడాదికాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్‌గా తీసుకోవాలని, చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
.@ncbn గారూ.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే. తిమ్మరాయప్ప… pic.twitter.com/GDVWPB65AZ
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 17, 2025
Tags : 1