Breaking News

పులివెందుల ఆర్వో ఆఫీస్‌ ముందు వైఎస్‌ జగన్‌ నిరసన

Published on Sun, 11/01/2026 - 12:59

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందుల ఆర్వో కార్యాలయం ముందు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరసన తెలిపారు. 70 మంది వైఎస్సార్‌సీపీ ఏజెంట్లతో కలిసి బైఠాయించారు. ఆర్వో శ్రీనివాస్‌, ఆర్డీవో చిన్నయ్యతో మాట్లాడిన వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను అడ్డుకోవడంపై ప్రశ్నించారు. ఎన్నికల అక్రమాలపై ఆయన ఫిర్యాదు చేశారు.

‘‘ఎలక్షన్‌ అంటే పోటీ జరగాలి. ఎక్కడ చూసినా టీడీపీ గూండాలే కనబడుతున్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు లేవు’’ అంటూ అధికారులను వైఎస్‌ జగన్‌ నిలదీశారు. ‘‘అధికారులు మౌనంగా ఉంటే ప్రజాస్యామ్యానికే  ప్రమాదం. ఇలా జరిగితే వీటిని ఎన్నికలంటారా?. ఎన్నికల్లో అక్రమాలపై ఆధారాలన్నీ ఉన్నాయి. బిహార్‌ పరిస్థితులను ఏపీలో చూస్తున్నాం. మాజీ సీఎం నియోజకవర్గంలో ఈ పరిస్థితులేంటి?’’ అంటూ వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘పులివెందులలో వాళ్లకు నచ్చినట్టు ఓట్లు వేసుకుంటున్నారు. మాజీ సీఎంను కొట్టామని అనిపించుకోవాలంటే చేయండి. లాఠీఛార్జ్‌ చేస్తారా చేయనీయండి.. అదొక్కటే మిగిలింది. స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు ఎందుకు జరపడం లేదు. ఎన్నికలు జరపడానికి చంద్రబాబుకు ఎందుకంత భయం. ప్రతిపక్షానికి  అవకాశం ఇవ్వకుండా ఏకగ్రీవాలు చేసుకుంటారా?. బూత్‌లను క్యాప్చర్‌ చేసి రిగ్గింగ్‌ చేసుకుంటున్నారు. ఓడిపోతామనే భయం ఉన్నప్పుడు  ఎన్నికలు ఎందుకు?’’ అంటూ వైఎస్‌ జగన్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అంతకుముందు.. వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఏజెంట్లను అనుమతించకుండా, దాడులకు దిగడంపై చైర్‌పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీలమ్మ, ఇతర అభ్యర్థులు నిరసన చేపట్టారు. రిపోలింగ్ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉదయాన్నే బూత్‌లను ఆక్రమించుకుని రిగ్గింగ్ చేసుకున్నారన్న వైఎస్సార్‌సీసీ నేతలు.. ఏజెంట్లు, ఓటర్లు, మీడియా అనేది లేకుండా ఇష్టారీతిన దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్వో కార్యాలయంలోకి వెళ్లకుండా అవినాష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అభ్యర్థులు వస్తున్నారని తెలిసి ఆర్వో కార్యాలయానికి తాళం వేశారు. జరిగిన అక్రమాలు దేశమంతా చూసిందని.. వెంటనే ఎస్‌ఈసీ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేస్తోంది.

ఇదీ చదవండి: వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు సర్కార్‌ కుట్రలు

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)