Breaking News

ప్రజల్ని పట్టి పీడిస్తున్న చంద్రబాబు: విడదల రజిని

Published on Thu, 05/29/2025 - 13:08

సాక్షి, గుంటూరు: ఏపీ సీఎం చంద్రబాబు ప్రజలను పట్టి పీడిస్తున్నారని, ఆయన చెప్పేదానికి చేసే దానికి ఏమాత్రం సంబంధం ఉండదని మాజీ మంత్రి విడదల రజిని(Vidadala Rajini) అన్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు, వైద్యారోగ్య రంగాల నిర్వీర్యంపై గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 

చంద్రబాబు(Chandrababu) చేప్పేవన్నీ అబద్ధాలే. చెప్పే ఏ మాట మీద ఆయన నిలబడరు. ఎంతో దూరదృష్టితో వైఎస్‌ జగన్‌ 17 మెడికల్‌ కాలేజీలు తీసుకొచ్చారు. ఐదు కాలేజీలను మా ప్రభుత్వ హయాంలో నిర్మించాం. మెడికల్ కాలేజీల ద్వారా ఆరోగ్య సేవలను జగన్ విస్తృత పరిచారు. వైద్య విద్య చదివేవారి ఆశలను నిజం చేయాలని జగన్ చూశారు. కార్పొరేట్ స్థాయిలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయాలని ఆయన భావించారు. నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించటానికి జగన్ అడుగులేశారు.. 

.. అలాంటి మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రయివేటీకరణ(AP Medical Colleges Privatization) చేస్తున్నారు. ఒక సంస్థతో సర్వే చేయించినట్టుగా కథ నడిపి వారితో ఫీజుబులిటీ రిపోర్టును తెప్పించారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో వారికి అనుగుణంగా రిపోర్టు ఇచ్చారు. ఒక్కో కాలేజీని సంవత్సరానికి రూ.5 వేల చొప్పున లీజుకు ఇస్తున్నారు. రూ.500 కోట్ల విలువైన ఆస్తిని రూ.5 వేలకు ఇవ్వటం ఏంటి?. పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని ఏం చేయదల్చుకున్నారు?. 

చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డెక్కారు. పరిశ్రమల ఊసే లేదు. అర్ధిక అభివృద్ధి పేరుతో చంద్రబాబు తన మనుషులకే మేలు చేస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సంక్షేమం అనేది చంద్రబాబుకు ఇష్టం లేదు. కరోనా సమయంలో జగన్ అన్ని వర్గాలకూ మేలు చేశారు. కానీ చంద్రబాబు పాలనలో ప్రజలకు అలాంటి ఆశలన్నీ నీరు గారి పోయాయి. ఇప్పుడు పీపీపీ పద్దతి అంటున్నారు. 

ఇప్పటికే ఆరోగ్య శ్రీ బిల్లులు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలను ఎందుకు ఇలా పట్టి పీడిస్తున్నారు?. ప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం ప్రభుత్వ బాధ్యత. ఆ బాధ్యత నుండి చంద్రబాబు ప్రభుత్వం తప్పుకోవడం సరికాదు. గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం కోసం జగన్ అనేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వాటిని కూడా ఈ ప్రభుత్వం నాశనం చేసింది. గిరిజనులకు మళ్ళీ డోలీల బాధ తప్పటం లేదు. మేము అధికారంలోకి వచ్చాక 
మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై రివ్యూ చేస్తాం అని రజిని అన్నారు. 

ఇదీ చదవండి: కడిగిన ముత్యంలా మా నాన్న బయటకు వస్తారు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)