Breaking News

ఏపీకి ట్రబుల్‌ మేకర్‌గా చంద్రబాబు: వెల్లంపల్లి

Published on Wed, 06/04/2025 - 13:32

సాక్షి, విజయవాడ: వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అందించిన సంక్షేమం కంటే ఎక్కువే అందిస్తానంటూ ఏపీ ప్రజలను చంద్రబాబు నాయుడు దారుణంగా మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్‌సీపీ వెన్నుపోటు దినం నిరసనల్లో భాగంగా.. బుధవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయి. 

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. చంద్రబాబు వ్యవహార శైలి ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించాడు. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలమయ్యారు. జగన్‌ అందించిన నవరత్నాలను పూర్తిగా నాశనం చంద్రబాబు చేశారు. జగన్‌ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని ప్రజలను మోసం చేశారు. చంద్రబాబువి మోసపూరితమైన హామీలు. 

గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందని చంద్రబాబు ప్రచారం చేయించారు. మరి ఇప్పుడు ఏడాది పాలనకే రూ.లక్షా 60 వేల కోట్ల అప్పు చేశారు. అలాంటప్పుడు ఏపీ ఇప్పుడేం అవుతుంది?. రైతులు, వలంటీర్లు, ఎండీయూ వాహనదారులు.. ఇలా అందరినీ దగా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పని చేసిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను టార్గెట్‌ చేయడం దుర్మార్గం. 

.. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుంది. తెనాలిలో ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలను పోలీసులు రోడ్లమీద కొట్టడం దారుణం. అమాయక ప్రజలపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గం. జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతలకు తగిన బుద్ధి చెబుతాం..

.. విజయవాడ నగరాన్ని చెత్త నగరంగా మార్చింది కూటమి ప్రభుత్వమే. బుడమేరుకు వరద వస్తుందని తెలిసి కూడా ప్రజలకు ఎలాంటి సమాచారం అందించలేదు. శాతవాహన కాలేజీకి ప్రిన్సిపల్ కిడ్నాప్ వ్యవహారం కూటమి ప్రభుత్వంలోనే సంచలనగా మారింది. ఎన్నికల మేనిఫెస్టో, సూపర్ సిక్స్, ఇంటింటికి రేషన్ ఇవన్నీ గోవిందా!. అప్పట్లో ఎన్టీఆర్‌ను ఎలా మోసం చేశారో.. ప్రజలను కూడా చంద్రబాబు ఇవాళ అలాగే మోసం చేశారు. 

ఈ రోజు వెన్నుపోటు దినం.. వంచన దినం. కాపుల ఉద్యమాన్ని కూటమి ప్రభుత్వం అణచివేసింది. రాష్ట్ర ప్రభుత్వం భూములు, ఇసుక కొట్టేసిన కూటమి నేతలు హ్యాపీగా ఉన్నారు. రాష్ట్రమంతా అవినీతిమయంగా మారింది అని వెల్లంపల్లి అన్నారు. డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సంవత్సర కాలంలో ప్రజలు కూటమి ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూపర్ సిక్స్‌లో ఇప్పటిదాకా ఎన్ని హామీలు నెరవేర్చారు?. చంద్రబాబే స్వయంగా చెప్పారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని.. పథకాలు ఇవ్వలేనని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు. మల్లాది విష్ణు ఆధ్వరంలో​ ధర్నా చౌక్ నుండి గాంధీనగర్ ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి