Breaking News

చంద్రబాబు, పవన్‌ హిందూ ద్రోహులు: వెల్లంపల్లి

Published on Sat, 01/31/2026 - 14:36

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాకనే నెయ్యిలో కల్తీ జరిగిందన్నారు. మంత్రి లోకేష్‌ 208-211 పేజీలు చదువుకుంటే విషయాలు తెలుస్తాయన్నారు.

‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే అల్లర్లు సృష్టిస్తోంది. బిహార్‌లో ఉన్న పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. కూటమి నేతలకు నిద్రలో కూడా వైఎస్‌ జగనే గుర్తుకువస్తున్నారు. చంద్రబాబు పవన్‌, లోకేష్‌ను చూసి హిందువులు మండిపడుతున్నారు. చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ కాలినడకన తిరుమలకు వెళ్లి గుండు కొట్టించుకోవాలి. బీఆర్‌ నాయుడు టీటీడీ ఛైర్మన్‌ అయ్యాక తిరుమలలో అరాచకాలు పెరిగాయి’’ అని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘చంద్రబాబు, పవన్‌ హిందూ ద్రోహులు. వారికి దేవుడిపై భక్తి లేదు. వెంకటేశ్వరస్వామిపై కూటమి నేతలు అపచారాలు ఆపాలని వేడుకుంటున్నా. బీసీ మహిళ విడదల రజినిపై దాడి చేయడం దారుణం. టీడీపీ నేతలు కట్టిన ఫ్లెక్సీలకు పోలీసులు బందోబస్తు ఏంటీ?. కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి’’ అని వెల్లంపల్లి దుయ్యబట్టారు.

Srinivas: నువ్వు సీఎంగా ఉన్నప్పుడు తీసిన శాంపిల్స్ లోనే

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)