Breaking News

ఏపీలో మహిళలకు భద్రత కరువైంది: వరుదు కళ్యాణి

Published on Fri, 08/29/2025 - 17:40

సాక్షి, నెల్లూరు: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కూటమికి ఓట్లు వేసినవారు బాధపడుతున్నారన్నారు. కూటమి పాలనలో లిక్కర్‌ అమ్మకాలు దారుణంగా పెరిగాయని.. లిక్కర్‌ అమ్మకాలతో మహిళలకు భద్రత కరువైంది’’ అని వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘మద్యానికి బానిసలై.. మహిళలకు భద్రత లేకుండా చేస్తున్నారు. ఏపీలో మహిళలపై గంటకు మూడు, నాలుగు అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్‌ పెరిగాయి. మహిళల రక్షణ కోసం వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం పోరాడుతుంది. ఏ ఒక్క  హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. మహిళలకు ఇచ్చిన హామీలకు చంద్రబాబు మంగళం పాడారు’’ అని వరుదు కల్యాణి దుయ్యబట్టారు.

..రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. ఎక్కడికక్కడ బెల్టు షాపులు, పర్మిట్ రూములకు అనుమతులు ఇచ్చేశారు. గతంలో మేము ‘దిశ’ పేరుతో మహిళా రక్షణ చేపడితే దాదాని పూర్తిగా నీరుగార్చారు. మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అధికారంలోకి వచ్చాక నెల రోజుల్లో గంజాయి నిర్మూలన అన్నారు. నేడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా గంజాయి లభ్యం, డ్రగ్స్ డోర్ డెలివరీ అవుతుంది. జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానంటూ అధికారంలోకి వచ్చారు. హామీలు విస్మరించి.. సూపర్ సిక్స్ అమలు చేసేశాం అంటున్నారు.

..ఎన్నికలకు ముందు ఉచిత బస్సు అనీ, ఐదు బస్సుల్లో అవకాశం కల్పించారు. ఏపీ రాష్ట్రాన్ని ముగ్గురు సీఎంలు పరిపాలిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్‌లు ముగ్గురు సీఎంలే. కలల రాజధాని నిర్మాణం అన్నారు.. నేడు అలల్లో తేలే రాజధాని పరిస్థితి చూస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం సంపద కాదు.. అప్పలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యేలే స్వయంగా మహిళలను వేధించే పరిస్థితి చూస్తున్నాం. మహిళలపై లైంగిక దాడులు చేసిన వారిపై చర్యలు లేవు

..మహిళపై చేయి వేసిన వారి తాట తీస్తా.. తోలు తీస్తా అన్న పవన్ ఎక్కడ తీస్తున్నాడో తెలియడం లేదు. చంద్రబాబు పాలనలోనే సుగాలి ప్రీతి ఘటన జరిగింది. ఎన్నికలకు ముందు రాజకీయాల కోసం ప్రీతి ఘటనను వాడుకున్నాడు పవన్.. రాజకీయ లబ్ధి కోసం వాడుకుని తీరా వచ్చాక గాలికి వదిలేశారు. పవన్‌కు చిత్తశుద్ధి వుంటే వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి’’ అంటూ వరుదు కళ్యాణి డిమాండ్‌ చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)