Breaking News

తిరుపతి లడ్డూ ఆరోపణలతో హెరిటేజ్‌ లింకులు!?

Published on Sat, 09/21/2024 - 13:52

న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌లో మునుపెన్నడూ లేని నీచపు రాజకీయానికి.. అది ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు తెర తీశారని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది.  మరోవైపు హిందూ సంఘాలు.. ఇంకోవైపు నలభై ఏళ్ల బాబు రాజకీయం గురించి తెలిసిన నేతలూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. జాతీయ పార్టీ టీఎంసీ సైతం చంద్రబాబు తీరుపై అనుమానాలు వ్యక్తం చేసింది.

టీఎంసీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే  ఎక్స్‌ వేదికగా చేసిన ఓ ఆసక్తికరమైన పోస్ట్‌.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలకు దిగారు. అందుకు ల్యాబ్‌ రిపోర్టులను సాక్ష్యంగా చూపిస్తున్నారు. లడ్డూల కోసం ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆయన పార్టీ ఆరోపిస్తోంది. అయితే..

చంద్రబాబు, ఆయన సతీమణి పేరిట హెరిటేజ్‌ పుడ్స్‌ అనే డెయిరీ సామ్రాజ్యం ఉందని, అది నెయ్యి కూడా  ఉత్పత్తి చేస్తోందని అన్నారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల సమయంలో నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఇదే హెరిటేజ్ సంస్థ షేర్లు 1,200 కోట్ల రూపాయలకు పైగా లాభాల్లోకి వెళ్లాయని సాకేత్ గుర్తు చేశారు. అప్పట్లో బీజేపీ,  స్టాక్ మార్కెట్‌ను మానిప్యులేట్ చేయడం వల్లే ఇది సాధ్యపడిందని  ఆరోపించారు.

 

ఎవరి కుటుంబమైతే నెయ్యి- పాల ఉత్పత్తి రంగాన్ని శాసిస్తోందో.. అదే కుటుంబానికి చెందిన వ్యక్తి ఇప్పుడు తిరుమల లడ్డూల విషయంలో కూడా గుజరాత్‌కు చెందిన ఓ ప్రైవేట్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని ఆరోపణలు చేశారని సాకేత్ గోఖలే ప్రస్తావించారు.

మొత్తంగా.. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు.. తిరుమల లడ్డూపై ఆరోపణలు చేశారని, దీనికోసం బీజేపీ సహకారాన్ని సైతం తీసుకున్నారని సాకేత్ గోఖలే ఆరోపించారు.

ఇదీ చదవండి: దేవుడే ఇక చంద్రబాబుకి బుద్ధి చెప్తాడు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)