Breaking News

సింగిల్‌గానే అధికారంలోకి వస్తాం: కేసీఆర్‌

Published on Sat, 03/22/2025 - 17:05

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణలో మరోసారి బీఆర్‌ఎస్‌ అధికారం చేపట్టడం తథ్యమని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(Kalvakuntla Chandrasekar Rao)  ఉద్ఘాటించారు. శనివారం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్‌లో జరిగిన రామగుండం నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతల సమావేశంలో ఆయన కీలక కామెంట్లు చేశారు.

బెల్లం ఉన్న దగ్గర ఈగలు వస్తాయి. అలాగే సిరిసంపదలు ఉన్న తెలంగాణకు దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు. పదేళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రామగుండంలో గెలిచిన ఎమ్మెల్యే ఓ సన్నాసి అంటూ కామెంట్‌ చేశారు.

ఆనాడు బలవంతంగా ఆంధ్రాలో కలిపారు. తెలంగాణను ఇందిరాగాంధీ మోసం చేశారు.  మోదీ నా మెడపై కత్తి పెట్టినా.. నేను వెనకడుగు వేయలేదు. ఈ నేలపై ఎవరూ శాశ్వతం కాదు. అందరూ ఒక్కో కేసీఆర్‌(KCR)లా తయారు కావాలి. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలి.  ఏపీలో కూటమి లేకుంటే చంద్రబాబు(Chandrababu) గెలిచేవారు కాదు. కానీ, బీఆర్‌ఎస్‌ మాత్రం సింగిల్‌గానే అధికారంలోకి వస్తుంది.. ఇది ఖాయం అని కేసీఆర్‌ అన్నారు.

కాంగ్రెస్‌ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. మేనిఫెస్టోలో పెట్టని హామీలు కూడా అమలు చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దే.  తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్‌ఎస్‌ మాత్రమే అని కేసీఆర్‌ అన్నారు.  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)