Breaking News

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీపై టీడీపీ కొత్త ఎత్తులు

Published on Tue, 08/13/2024 - 05:21

సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీపై టీడీపీ, జనసేన, బీజేపీ ఇంకా తర్జనభర్జన పడుతున్నాయి. ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచించినా అందుకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉండడంతో ఆ పార్టీ నుంచి భారీగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను కూటమి వైపు తిప్పుకొనేందుకు కుట్రలు పన్నారు. 

భారీగా డబ్బు ఇవ్వజూపారు. అయినా కూటమి వైపు రావడానికి ప్రజాప్రతినిధులు ససేమిరా అన్నారు. ఈ పరిస్థితుల్లో పోటీకి పెడితే ఓడిపోవడం ఖాయమనే అంచనాకు కూటమి నేతలు వచ్చారు. సీఎం చంద్రబాబు రెండుసార్లు విశాఖ జిల్లా ఎమ్మెల్యేలతో జరిపిన చర్చల్లో గెలవడానికి సరిపడా ప్రజాప్రతినిధులు లేరని తేలింది. సరిపడినంతమందిని కూటమి వైపు తెస్తేనే అభ్యర్ధిని ప్రకటిస్తానని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. 

మొదట్లో అనకాపల్లికి చెందిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణను పోటీకి దింపాలని భావించారు. అయితే వైఎస్సార్‌సీపీ తరఫున మాజీ మంత్రి, సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ పోటీకి దిగడం, మెజారిటీ ప్రతినిధులు వైఎస్సార్‌సీపీ వైపే ఉండడంతో పీలా గోవిందు చేతులెత్తేశారు.  దీంతో గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఆశించిన వ్యాపారవేత్త బైరా దిలీప్‌ పేరును పరిశీలిస్తున్నారు. 

ఆయన అయితే భారీగా డబ్బు ఖర్చు పెట్టి వైఎస్సార్‌సీపీ స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తారని టీడీపీ సీనియర్లు భావిస్తున్నట్లు సమాచారం. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా సాధ్యమయ్యేలా కనిపించకపోవడంతో ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదు. నామినేషన్లు దాఖలుకు గడువు ముగిసే లోగా అవకాశాలు మెరుగుపడితే దిలీప్‌ను పోటీకి దింపాలని చూస్తున్నారు. లేనిపక్షంలో పోటీకి దూరంగా ఉండడమే మేలని చంద్రబాబు భావిస్తున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)