Breaking News

చింతమనేని సీట్ సిరిగిపోయిందా ?

Published on Thu, 01/11/2024 - 13:58

రౌడీ ఎమ్మెల్యే అనే ట్యాగ్ లైను వేసుకోవడానికి తెగ ఇష్టపడే దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు ఇప్పుడు గడ్డు కాలం వచ్చింది.. 'ఆయనొద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ తెలుగు తమ్ముళ్లు అక్కడక్కడా ఫ్లెక్సీలు కట్టడం తెలుగుదేశాన్ని.. చంద్రబాబును కలవరపరుస్తోంది. నోటి దురుసుకు చేయి జోరుకు మారు పేరుగా నిలిచిన చింతమనేని గతంలో టీడీపీ హయాంలో ఉన్నపుడు మహా ఉజ్వలంగా వెలిగిపోయారు. తన దెందులూరు నియోజకవర్గానికి ఆయనే ముఖ్యమంత్రి, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, గనులు.. ఇలా అన్ని శాఖలకూ ఆయనే అధిపతి. అడ్డొస్తే అడ్డంగా నరికేసినంత పని చేసేవారు.

ఆ దూకుడులో భాగంగానే ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిని ఈడ్చి కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తరువాత అనుమతులు లేకుండా అడవీ భూముల్లో రోడ్లు వేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ సిబ్బందిని కొట్టారు.. అంతేకాకుండా అధికారంలో ఉన్నపుడు నోటి దురుసును అడ్డూ అదుపూ లేకుండా పోయేది. 'ఏంటీ పవన్ కళ్యాణ్ మద్దతుతో కదా మీరు గెలిచారు' అని అడిగితే.. 'హహ.. పవన్.. ఒక సన్నాసి.. సొంత అన్నను పాలకొల్లులో గెలిపించలేనివాడు మా చంద్రబాబును గెలిపిస్తాడా..? ఊరుకోండయ్యా..' అని సెటైర్లు వేశారు. 'ఒరేయ్ మీరు ఎస్సీలు..! మీకెందుకురా రాజకీయాలు..? మేము రాజకీయాలు చేస్తాం' అని ఓపెన్ సభలో చెప్పడం కూడా ఆయనకే చెల్లింది.

ఆ తరువాత ప్రభుత్వంతో పాటు అత‌నూ ఓడిపోయినా కూడా.. అయన జోరు తగ్గకపోయేసరికి పోలీస్ కేసుల్లో పడ్డారు. మళ్ళీ బయటకు వచ్చాక అదే దూకుడు చూపడం మొదలైంది. మొన్నటికి మొన్న తన వ్యవసాయ భూముల్లో మేకలు మేస్తున్నాయని కొందరు మేకలకాపరులమీద దాడి చేయడమే కాకుండా రెండు మేకలు సైతం తన కార్లో ఎత్తుకెళ్ళి తనకు ఎదురే లేదని మరోమారు చాటిచెప్పారు. అది కాస్తా వివాదంగా.. యాదవులు సంఘటితమై గళం ఎత్తేసరికి ఆయన కాస్త వెనక్కితగ్గారు. ఇదిలా ఉండగా ఆయనకు మళ్ళీ దెందులూరు టికెట్ ఇస్తారని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి.

'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. ఇది కాస్తా చింతమనేని ప్రభాకర్కు ఇబ్బందికరంగా మారింది. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరి మీద ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికలకోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్కు ఇప్పుడు ఇలా వ్యతిరేకపవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది. మరి చంద్రబాబు ఆయనను మారుస్తారో.. కొత్తవాళ్లను తీసుకొస్తారో.. లేదా 'రౌడీలకు టిక్కెట్లు ఇవ్వకపోతే ఎలా ? వాళ్ళే కదా అసలైన నాయకులూ' అని భావించి మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తారో  చూడాలి.
-- సిమ్మాదిరప్పన్న

ఇవి చ‌ద‌వండి: చంద్రబాబు.. లోకేశ్‌కు మేము పేరు పెట్టలేమా?: మంత్రి బుగ్గన ఫైర్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)