Breaking News

రామకుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ

Published on Thu, 08/07/2025 - 08:54

సాక్షి, చిత్తూరు: స్వయానా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో టీడీపీ అప్రజాస్వామికంగా వ్యవహరించింది. అడ్డదారిలో మణీంద్రం ఎంపీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుంది. నామినేషన్ల పరిశీలనకు వెళ్లకుండా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హర్పితను టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. దీంతో ఆమె నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.

2021లో జరిగిన ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలుపొందిన శాంతకుమారి అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో ఉప ఎన్నిక అవసరమైంది. గత నెల 30 నుంచి ఈనెల 1వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ జరిగింది. టీడీపీ అభ్యర్థులుగా అరుణ, విశాలాక్షి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా శాంతకుమారి తనయ హర్పిత నామినేషన్లు దాఖలు చేశారు. 

అయితే.. హర్పితను రెండో సెట్‌ నామినేషన్‌ వేయనీయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో ఆమె తనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు ఈ విషయాన్ని అస్సలు పట్టించుకోలేదు. ఈలోపు రామకుప్పం మండలంలో ఒక్క స్థానం గెలవని టీడీపీ, అప్రజాస్వామికంగా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకుంది.  అదే సమయంలో టీడీపీ గూండాల వల్ల హర్పిత నామినేషన్ల పరిశీలనకు వెళ్లలేకపోయారు. ఫలితంగా మణీంద్రం ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. రామకుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందనే చర్చ జోరందుకుందక్కడ.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)